YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా ఆంధ్ర ప్రదేశ్

ఆర్జీవీ ట్వీట్లపై మంత్రి పేర్ని నాని కౌంటర్..

ఆర్జీవీ ట్వీట్లపై మంత్రి పేర్ని నాని కౌంటర్..

అమరావతి
ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం గత కొన్నిరోజుల నుంచి హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వం, మంత్రులపై ప్రశ్నల వర్షం కురిపించారు. వరుస ట్వీట్లతో పాటు ‘ప్రభుత్వానికి పది ప్రశ్నలు’ పేరుతో ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వర్మ ప్రశ్నలపై తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పందించారు.  రూ.100 టికెట్ను రూ.1000, రూ.2000కు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్, సప్లయ్ అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?  గత 66 సంవత్సరాలుగా చట్టాలకు లోబడే ప్రభుత్వాలు ధర నిర్ణయిస్తున్నాయి. కానీ, ఇప్పుడు సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి ఉండకూడదనే ప్రభుత్వం సినిమా టికెట్ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. * నిత్యావసరాల ధరల్నే ప్రభుత్వం నియంత్రించవచ్చని.. సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని మీరు ప్రశ్నించారు. సినిమా థియేటర్లు ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు.  బలవంతంగా ధరలు తగ్గిస్తే ప్రోత్సాహం తగ్గుతుందన్నారు. ప్రోత్సాహం తగ్గేదెవరికి.. కొనేవారికా? లేక అమ్మేవారికా? నిర్మాతల శ్రేయస్సు తప్ప ప్రేక్షకుల గురించి ఆలోచించరా?  వైద్యం, విద్య మాదిరిగా రాయితీని ప్రభుత్వం భరించాలన్నారు. సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగా గానీ మేం భావించడం లేదని మంత్రి స్పష్టం చేసారు.

Related Posts