న్యూ ఢిల్లీ జనవరి 5
ఉత్తరాఖండ్ హైకోర్టుతో పాటు కొందరు అధికారుల వేసిన తప్పుడు పిటిషన్ల పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు రూ.25 లక్షల జరిమానా విధించాలని ఆదేశించింది. ఇలాంటి నిరాధరమైన ఆరోపణలు మరోసారి చేయకుండా ఉండేందుకే ఇలాంటి జరిమానా విధించాల్సి వచ్చిందని కోర్టు తెలిపింది. అయితే ఈ మొత్తాన్ని వారం రోజుల్లోగా చెల్లించాలని తెలిపింది. కాగా ఈ కేసు విచారణలో తనను ఇంప్లిమంట్ చేయాలని అతడు చేసుకున్న దరఖాస్తును సుప్రీం కోర్టు తిరస్కరించింది. ముందే అరోపణలు చేయకుండా ఉంటే బాగుండేదని సూచించింది. మరోవైపు దరఖాస్తును నామమాత్రంగా భర్తీ చేయడంపై తప్పుబట్టింది. కాగా సుప్రీం కోర్టు విధించిన జరిమానాను నాలుగువారాల్లో దరఖాస్తుదారు చెల్లించాలని లేని పక్షంలో హరిద్వార్ కలెక్టర్ నుంచి రాబట్టాలని ఎ.ఎం.ఖాన్విల్కర్ జస్టిస్ సి.టి. రవికుమార్ లను ఆదేశించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ కు చెందిన ఖఱాస్గీ (దేవి అహల్యాబాయ్ హోల్కర్ చారిటీస్) ట్రస్టుకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ ఆదేశాలిచ్చింది. అయితే పిటిషనర్ తరుపున దరఖాస్తును ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా సుప్రీం తిరస్కరించింది.‘మీరు ఆరోపణలు చేస్తారు.. అందుకు సంబంధించిన వివరాలు చూపించరు.. ఆ తరువాత క్షమాపణ చెబుతారు.. ఇదంతా కోర్టు సమయం వృథా కావడమేగా..’ అని సుప్రీం న్యాయవాదిని ప్రశ్నించింది. గతంలో హోల్కర్ రాజవంశానికి చెందిన 246 దాతృత్వ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికే యాజమాన్య హక్కులు ఉంటాయని మధ్యప్రదేశ్ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. అయితే దీనికి సంబంధించిన కొందరు వ్యక్తులపై నేర విచారణకు ఆదేశించింది. ఆ తరువాత సుప్రీం కోర్టు దీనిపై స్టే విధించింది. ఫైనల్ గా దానిని రద్దు చేయడానికి అంగీకరించమని తెలిపింది. మరో కేసులలో నాలుగేళ్ల కిందట ఓ వ్యాజ్యంలో తాము జరిమానాగా చెల్లించాల్సిన రూ.25 లక్షల మొత్తాన్ని విరాళంగా మార్చాలని ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను త్రిసభ్య ధర్మాసనానికి సిఫార్సు చేస్తామని సుప్రీం తెలిపింది. అయితే త్రిసభ్య ధర్మాసం పిటిషనర్లకు అపరాధ రుసుం విధించాలని ఆదేశించింది. దీంతో తాజా అభ్యర్థన కూడా అటువంటే ధర్మాసనమే పరిశీలించడం సముచితమని జస్టిస్ పి.టి. రవికుమార్ తెలిపారు.