రామచంద్రాపురం
తూర్పుగోదావరి జిల్లాలో అనేక చోట్ల వైసీపీ నేతలు సంక్రాంతి పేరుతో మామూళ్ల దందా మొదలు పెట్టారు. ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ పేరుతో వాహనాల్లో వెళ్లి వైసీపీ పండగ మామూళ్లు వసూలు చేస్తున్నారు. జనవరి నెల కోటా బియ్యాన్ని ఇంటింటికి పంపిణీ చేస్తూ అదే వాహనంలో పండగ మామూళ్లు పేరుతో ఓ డబ్బా ఏర్పాటు చేశారు. బియ్యం తీసుకునే కార్డుదారులను అందులో పండగ మామూళ్లు వేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మంత్రి వేణు సొంత నియోజకవర్గం లోని రామచంద్రపురం మండలం వెళ్ల గ్రామంలో ఇలా అప్పు డే వసూళ్లు ప్రారంభిం చారు. బియ్యం పంపిణీ చేసే వాహనం డ్రైవరు.. సిబ్బంది వైసీపీ నేతలే కావడంతో ప్రతి ఇంటికి వెళ్తున్నారు. సంక్రాంతి మామూళ్లు డబ్బాలో వేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కనీసం 250 నుంచి 400 వరకు అడుగుతున్నారు. రెండున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం పథకాల పేరుతో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తోందని.. ఇప్పుడు పండగకు మామూళ్లు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని గదామాయి స్తున్నారు. దీంతో భయపడి డబ్బులు ఇస్తున్నారు. మామూళ్లు ఇవ్వకపోతే అధికారులతో చెప్పి పథకాలు ఆపేయి స్తామని..కార్డులు రద్దు చేయిస్తామని బెదిరిస్తున్నారు.