YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హింస వద్దు : సీఎం చంద్రబాబు

హింస వద్దు : సీఎం చంద్రబాబు

వ్యక్తిగత హింసకు నేను వ్యతిరేకయపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం నాడు అయన : టిడిపి విస్తృత సమావేశంలో మాట్లాడారు. మన పోరాటంలో ఘర్షణలు,ఉద్రిక్తతలకు తావులేదు. చిన్నఘర్షణలు, స్వల్ప ఉద్రిక్తతలు కూడా ఎక్కడా జరగరాదని నిర్దేశించారు. ఘర్షణలు, ఉద్రిక్తతలు అభివృద్ధికి అడ్డంకి అవుతాయి.  మన ధర్మపోరాటానికి విఘాతం అవుతాయి.జరిగిన అన్యాయంపై నిత్యం చర్చించాలి. నిరంతరం మాట్లాడితే కసి పెరుగుతుంది. రాష్ట్రంలో ప్రతిఒక్కరిలో చలనం రావాలి. ధర్మపోరాటంలో అందరూ కలిసిరావాలి ఉద్యమ స్ఫూర్తితోనే జూన్ 2న నవనిర్మాణ దీక్ష వుంటుందని అన్నారు. అభివృద్ధి స్ఫూర్తితోనే జూన్ 8న మహా సంకల్పం. ఒకవైపు అందరూ కష్టపడి పనిచేయాలి.  మరోవైపు హక్కుల కోసం సమష్టిగా పోరాడాలి. కేంద్రం సహకరించినా,సహకరించక పోయినా అభివృద్ధి ఆగదు. సహకరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అయన అన్నారు. ఈ రోజు కాకపోయినా,రేపైనా మనకు ఇవ్వాల్సింది ఇవ్వక తప్పదు. మనం తప్పులు చేస్తే మనకే సమస్య. మనం ఆధిపత్యంగా వ్యవహరించినా మనకే సమస్య. కీలక పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. 

Related Posts