YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా ఆంధ్ర ప్రదేశ్

సినిమా రచ్చ..రచ్చ

సినిమా రచ్చ..రచ్చ

విజయవాడ, జనవరి 6,
ఇటీవల సినిమా టిక్కెట్ల అంశంపై పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పేదలకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి జగన్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లని తగ్గించిన విషయం తెలిసిందే. దీని వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల మీద ఆధారపడ్డ వేలాది మంది కార్యకర్తలు నష్టపోతారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కానీ ఎవరు కూడా పైకి మాట్లాడటం లేదు. ఆ మధ్య న్యాచురల్ స్టార్ నాని మాత్రం మాట్లాడితే…ఆయనపై వైసీపీ మంత్రులు విరుచుకుపడ్డారు.ఇక ఆ తర్వాత ఎవరు దీనిపై స్పందించలేదు. కానీ తాజాగా డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో మీడియా, సోషల్ మీడియాల్లో జగన్ ప్రభుత్వాన్ని సినిమా టిక్కెట్ల అంశంపై ప్రశ్నిస్తున్నారు. అసలు సినిమా విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఏంటి? అన్నట్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే వరుసపెట్టి సోషల్ మీడియాలో మంత్రి పేర్ని నానికి ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నారు. దీనికి పేర్ని నాని కూడా కౌంటర్లు ఇస్తూ వచ్చారు.అదే సమయంలో మంత్రి కొడాలి నాని సైతం…వర్మపై విరుచుకుపడ్డారు. పక్క రాష్ట్రాల్లో ఉంటూ, అక్కడ ట్యాక్స్‌లు కడుతూ.. ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత ఎవరికి లేదని అంటున్నారు. చంద్రబాబు అయినా, ఆయన చెంచా గాళ్ళు అయినా ట్విట్టర్‌లో మొరగడం తప్ప చేసేది ఏం లేదంటూ ఫైర్ అయ్యారు. దమ్ముంటే సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గకుండా ఆపండని సవాల్ విసిరారు. ఇక కొడాలికి వర్మ నుంచి కౌంటర్ వ్చేసింది. న్యాచురల్ స్టార్ నాని మాత్రమే అని, కొడాలి నాని ఎవరో తనకు తెలియదంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే ఇదంతా వైసీపీ ఆడిస్తున్న గేమ్ అని, వర్మని నమ్మడానికి వీల్లేదని, గతంలో ఆయన చంద్రబాబుని దెబ్బకొట్టి, జగన్‌కు లబ్ది చేకూరేలా చేశారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇక ఏం మాట్లాడినా చంద్రబాబు అని తప్ప, కొడాలి నానికి మరొకటి తెలియదని అంటున్నారు. ఈ సినిమా టిక్కెట్ల వ్యవహారమంతా ఒక డ్రామా అని అంటున్నారు. మరి ఈ రచ్చ ఎంతవరకు వెళుతుందో చూడాలి.

Related Posts