YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గంటా...ఏ ఎండకా గొడుగా..

గంటా...ఏ ఎండకా గొడుగా..

విశాఖపట్టణం, జనవరి 6,
నాలుగుసార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఎంపీ. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి. ఇవీ గంటా శ్రీనివాసరావు పొలిటికల్‌ బయోగ్రఫీలో కీలక అంశాలు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచినా.. తాను ఉన్న టీడీపీ అధికారానికి దూరంగా కావడంతో సైలెంట్‌ అయ్యారు.మధ్యలో గంటా వైసీపీలోకి వెళ్తున్నారని ప్రచారం జరిగింది. తర్వాత బీజేపీవైపు చూస్తున్నారని.. జనసేనలో చేరతారని అనేక ఊహాగానాలు వినిపించాయి. గంటా ఎనాడూ తన రాజకీయ భవిష్యత్‌పై పల్లెత్తు మాట మాట్లాడలేదు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి కొన్నిరోజులు చర్చల్లో నలిగారు. ఒకానొక దశలో క్రియాశీలక రాజకీయాల నుంచి గంటా తప్పుకొంటున్నారనే ప్రచారం జరిగింది. అటువంటి మాజీ మంత్రి ఇప్పుడు కొత్త సమీకరణాలతో స్క్రీన్‌పైకి వస్తున్నారు.పాతికేళ్ల రాజకీయంలో ఏనాడూ కులం ప్రస్తావన తీసుకురాని గంటా శ్రీనివాసరావు.. ఇప్పుడు తన సామాజికవర్గం బలం.. బలంగంపై ఫోకస్‌ పెట్టారు. ప్రతి ఎన్నికలకు నియోజకవర్గాన్ని మార్చేస్తారు. కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండే చొడవరం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు గంటా. తర్వాత కాపు సామాజికవర్గం ఆధిపత్యం ఉండే అనకాపల్లిలో పీఆర్పీ నుంచి గెలిచారు. ఆ తర్వాత భీమిలి. ప్రస్తుతం విశాఖ నార్త్‌ నుంచి ఎమ్మెల్యే. ఈ రెండు చోట్లా కాపుల ఓటింగ్‌ ఉన్నప్పటికీ బీసీలు.. ఇతర సామాజికవర్గాల ప్రాధాన్యం ఎక్కువ. గెలుపుకోసం అనుకూలమైన నియోజకవర్గాలను ఎంచుకున్నారే తప్ప.. ఏనాడూ కులంపై ఆధారపడి రాజకీయాలు చేయలేదు.వాస్తవానికి కాపు సామాజికవర్గం గంటాను తమ కుల నాయకుడిగా చూస్తుందే తప్ప ఆయన ఎప్పుడూ ఆ సామాజికవర్గం కోసం పాటుపడింది లేదు. దీనికి కుటుంబ, రాజకీయ, వ్యాపారాలు కారణమన్నది ఓపెన్‌ టాక్‌. గంటా బంధుత్వాలు, వ్యాపార సంబంధాలు విస్తృతం. గతంలో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం తప్ప ఆయన కాపు బ్రాండ్‌ను ఎప్పుడూ మీద వేసుకోలేదు. కిర్లంపూడి వేదికగా కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఉవ్వెత్తున జరిగినప్పుడు గంటా మంత్రిగా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆ సామాజికవర్గం ఆందోళన చెందినప్పుడు కూడా గంటా స్పందించలేదని చెబుతారు. తునిలో బహిరంగసభ ద్వారా తమ ఆకాంక్షలను ప్రభుత్వానికి చెప్పుకోవడానికి కాపులు ప్రయత్నించారు. ఆ సమయంలోనూ లోపాయికారీ మద్దతివ్వడానికి సైతం గంటా వెనకాడారని అపవాదు మోశారు. కాపుల ఆకలి కేకలు వంటి నినాదాలతో ఆ సామాజికవర్గం గంటా ఇంటిని ముట్టడించిన పరిస్థితులు ఉన్నాయి.ఇప్పుడు గంటా శ్రీనివాస్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కాపు సామాజికవర్గం లేకపోతే తాను లేననే ధోరణి వినిపిస్తున్నారు. రంగా విగ్రహావిష్కరణ సభలో.. కాపులంతా ఏకం కావాలని ఆయన పిలుపిచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగిన కాపు ముఖ్యనేతల సమావేశంలో గంటా పాల్గొన్నారు. రెండు కుటుంబాల పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లడం ద్వారా కాపులకు రాజ్యాధికారమే అజెండాగా గంటా ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాపు సామాజికవర్గంలో బలమైన నాయకుడు అనే ముద్ర వేసుకోవడం ద్వారా రాజకీయాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నంగా భావిస్తున్నారట. గంటా ఎటువెళ్తే నాయకులు అటు మళ్లుతారనే అభిప్రాయం కలిగించడం ద్వారా ఆ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నారనే చర్చ నడుస్తోంది.నూతన సంవత్సరంలో క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని గంటా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన క్యాస్ట్ పాలిటిక్స్‌తో రంగ ప్రవేశం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి కొత్త పొత్తులు ఉదయించే ఆస్కారం ఉందనే చర్చ జరుగుతోంది. ఆ లాభనష్టాలను ముందే పసిగట్టిన గంటా.. కులం కార్డును అందుకున్నారని సమాచారం. వివిధ కారణాలతో రాజకీయంగా స్తబ్ధతగా ఉన్న నాయకులతో గంటా సమావేశమవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. అధికార వైసీపీ సైతం గంటా ఎత్తుగడలను నిశితంగా పరిశీలిస్తోంది. హైదరాబాద్‌లో కాపుల మీటింగ్ కేవలం కాఫీ కోసం జరిగిందే తప్ప ప్రాధాన్యం లేదని లైట్ తీసుకుంది. ఇలాంటి తరుణంలో గంటా శ్రీనివాసరావు వ్యూహం వెనక ఆంతర్యం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది

Related Posts