విశాఖపట్నం
బుల్లీ బాయ్ యాప్ నింది తులను కఠినంగా శిక్షించాలంటూ మ హిళా చేతన, ముస్లీం సంఘాల నేతలు డిమాండ్ చేశారు.మహిళా చేతన నాయకురాలు కత్తిపద్మ మాట్లాడుతూ ముస్లిం మహిళలను,బాలికలను యా ప్ లో అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ,వేలం పాట నిర్వహించడం హేయమైన చర్య అని , ముస్లీం మహిళలను టార్గెట్ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ముగ్గురు టీనేయర్స్ ను అరెస్ట్ చేసి చేతులు దులుపుకో వడం కాదని,యాప్ వెనుక వున్న అస లు వ్యక్తులను ఎవరో బైట పెట్టాలని కోరారు.న్యాయవాది జహీర్ మాట్లా డుతూ అరాజకాలను ప్రశ్నించిన మహిలను వేలం వేస్తూ కించపరిచే చర్యలు జరుగుతున్నాయని అన్నారు. మైనార్టీలను భయపెట్టాలని ఇదంతా చేస్తున్నారని హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని అన్నారు. హక్కులను కాలరాయడమే కాకుండా మత విద్వేషాలకు దారితీసే పరిస్ధితి రావచ్చని అన్నారు.