విశాఖపట్నం
విశాఖలో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం తీరు పరిశీలనకు రెండు రోజుల పర్యటన నేటితో పూర్త వుతోందని,ఈ ప్రాజెక్టుల పూర్తికి ఏమి అవసరమో చూసి కేంద్రం దృష్టికి తీసు కువెళతామని బీజేపీ ఎంపీ జివిఎల్ అన్నారు.441 కోట్లతో గంభీరంలో ఐఐఎం నిర్మాణం సాగుతోందని,దీన్ని ప్రజలు సందర్శించే అవకాశం కల్పిం చాలని అన్నారు.సమీర్ రీసెర్చి సంస్థ ను కూడా సందర్శించామని,మెడిటెక్ లో అత్యాధునిక వైద్య సామగ్రి తయా రవుతోందని అన్నారు.హెచ్.పి.సిఎల్ విస్తరణ పనులు కూడా చూశామని 28 వేల కోట్లతో 15 మిలియన్ టన్నులకు ఉత్పత్తి పెంచుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల సత్వర పూర్తికి సహకరించాలని విశాఖలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిని సమీక్షించామని 940 కోట్లతో నిర్మిస్తున్న డ్రెయినేజి పథకం అనుకున్న టైముకి పూర్తి చేయాలని అన్నారు.అమృత్ పథకం కింది 24×7 నీటి సరఫరా పథకం వేగంగా పూర్తి చేయాలని, ఇఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి తగిన మౌలిక వసతులుకల్పించాలని కోరామని తెలిపారు.