హైదరాబాద్
రామకృష్ణ సెల్ఫీ వీడియోలో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడారని రామకృష్ణ తెలిపారు. అయితే.. ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సీరియస్గా స్పందించారు.ఎమ్మెల్యే వనమాను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘రాఘవ కీచక చేష్టలను తట్టుకోలేకే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు కారకుడైన వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలి. మానవ మృగానికి టీఆర్ఎస్ వత్తాసుగా నిలవడం దుర్మార్గం. ఎమ్మెల్యే కుమారుడు ఇన్ని అరాచకాలు చేస్తుంటే సీఎం కేసీఆర్‌కు తెలియదా?. తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది...?. ఇంటెలిజెన్స్ మొత్తం ప్రతిపక్షాల ప్రజాపోరాటలపై నిఘాకే పరిమితమైందా..? వనమా రాఘవ మాఫియాను మించిపోయారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి. ఘటన జరిగి 3 రోజులైనా చర్చలెందుకు తీసుకోలేదు’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాఘవ సెల్ఫీ వీడియోలో ఏం చెప్పారు..!?
రామకృష్ణ సెల్ఫీ వీడియోలో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ నా భార్య గురించి అసభ్యంగా మాట్లాడారు. నా ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని నా భార్యను హైదరాబాద్ తీసుకుని రమ్మని రాఘవ చెప్పాడు. నిన్ను అన్ని విధాల కాపాడుకుంటానని ప్రమాణం చేసి నా భార్యను రాఘవ దగ్గరకు ఎలా పంపగలను?. రాఘవ డబ్బులు అడిగినా ఇచ్చేవాడిని కానీ నా భార్యను కోరుకున్నాడు. అది ఎలా ఇవ్వగలను? నేను ఒక్కడినే చనిపోదామనుకున్నా.. కానీ ఆ తరువాత కూడా నా భార్య పిల్లలకు ఇబ్బందులు తప్పవని నాతోనే వాళ్లని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నా. నీ భార్యను నా దగ్గరకు పంపు.. లేకపోతే నీ సమస్య పరిష్కారం కాదు.. నీ ఆస్తి నీకు రాదు.. నిన్ను ఎవరూ కాపాడలేరని రాఘవ బెదిరించారు. అందుకే ఈ ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నా. నాకు నా తండ్రి ద్వారా వచ్చే ఆస్తిని అమ్మి ఎవరికీ అన్యాయం జరగకుండా అప్పులు చెల్లించండి. నేను కష్టాల్లో ఉన్నానని తెలిసి నా తల్లి, అక్క సైతం వేధింపులకు పాల్పడ్డారు’ అని రాఘవ వీడియోలో చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామకృష్ణ ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎంత కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.