YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ప్రధాని పై దాడి..ప్రజాస్వామ్యంపై దాడి..

ప్రధాని పై దాడి..ప్రజాస్వామ్యంపై దాడి..

ముంబై జనవరి 6
ఏ విషయం మీదనైన మొహమాటం లేకుండా మాట్లాడే ఈ బ్యూటీని ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు ఆమె ఫ్యాన్స్. తాజాగా మరో ఘటనపై స్పందించింది ఈ తార.ప్రధాని నరేంద్ర మోదీ ఓ మీటింగ్ కోసం పంజాబ్ వెళ్లగా.. అక్కడ కొందరు ప్రొటెస్టర్స్ అడ్డగించారు. దీంతో అక్కడ దాదాపు 20 నిమిషాలు వెయిట్ చేసిన పీఎం కాన్వాయ్ అనంతరం అక్కడి నుంచి వేరే రూట్ తీసుకొని వెళ్లిపోయింది. దీనిపై కంగనా రనౌత్ సోషల్ మీడియాలో స్పందించింది.ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టోరీలో.. ‘పీఎంపై పంజాబ్‌లో జరిగింది చాలా అవమానకరం. 140 కోట్ల మందికి ప్రతినిధి అయిన ఆయనపై దాడి జరగడం అంటే ప్రతి భారతీయుడిపై  దాడి జరిగినట్లే. ఇది ప్రజాస్వామ్యంపై దాడి. దీన్ని ఇప్పుడే అపకపోతే పంజాబ్ తీవ్రవాదులకు అడ్డాగా మారే ప్రమాదం ఉంది. అప్పుడు దేశం మొత్తం దానికి భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వస్తుంద’ని రాసుకొచ్చింది. కాగా ఈ భామ నటిగా వరుస సినిమాలు చేస్తూనే నిర్మాత కూడా నవాజుద్ధీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ ముఖ్యపాత్రల్లో ‘టికు వెడ్స్ షేర్’ అనే సినిమాని నిర్మిస్తోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దేశంలో జరిగే వివిధ సంఘటనలపై  వివాదాస్పాద కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటుందన్న విషయం తెలిసిందే.

Related Posts