YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

క్లీన్‌ గంగా ఫండ్‌’కు నెల జీతాన్ని విరాళంగా ఇవ్వండి రాష్ట్రపతి,ప్రధాని నరేంద్రమోదీకి కేంద్ర మంత్రి గడ్కరీ లేఖ

క్లీన్‌ గంగా ఫండ్‌’కు నెల జీతాన్ని విరాళంగా ఇవ్వండి    రాష్ట్రపతి,ప్రధాని నరేంద్రమోదీకి కేంద్ర మంత్రి  గడ్కరీ లేఖ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘నమామీ గంగె’ కార్యక్రమానికి (‘క్లీన్‌ గంగా ఫండ్‌’కు) తమ వంతు సాయంగా నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీకి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ లేఖ రాశారు. కాలుష్యంతో కూరుకుపోయిన గంగానదీ ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా గడ్కరీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేవలం వీరినుంచే కాకుండా వివిధ ఎన్జీవోల నుంచి, వ్యక్తిగత సహాయాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పటికీ క్లీన్‌ గంగా ఫండ్(సీజీఎఫ్‌)కు రూ.250కోట్ల వరకూ నిధులొచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర మంత్రులు,రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలనూ తమ నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావొచ్చు. ప్రజలు తమకు తోచినంత రాళంగా ఇవ్వొచ్చు. కొంతమంది రూ.300కూడా విరాళంగా అందజేశారు. అంతేకాకుండా ప్రవేటు రంగం పరిధిలో ఉన్న భవన నిర్మాణాలు, రోడ్లు, ఘాట్ల నిర్మాణాలు, వినోద రంగాల్లో ఉన్న వారి దగ్గర్నించీ విరాళాలు స్వాగతిస్తున్నాం. అయితే విరాళంగా ఇచ్చే నగదుకు పన్ను మినహాయింపు ఉంటుంది’ అని ఆయన తెలిపారు.కాలుష్యంతో కూరుకుపోయిన గంగానదీ ప్రక్షాళనకై కేంద్ర ప్రభుత్వం 2015లో నడుం బిగించింది. 2015-2020లోపు పూర్తిగా ప్రక్షాళన చేసి నదికి పూర్వ రూపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకు గానూ కేంద్ర ప్రభుత్వం రూ.20,000కోట్లు కేటాయించింది.

Related Posts