YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా ఆంధ్ర ప్రదేశ్

సంక్రాంతికైనా సినిమాలకు సొల్యూషన్ దొరుకుతుందా

సంక్రాంతికైనా సినిమాలకు సొల్యూషన్ దొరుకుతుందా

విజయవాడ, జనవరి 7,
ఒకవైపు టికెట్ల వివాదం, మరో వైపు థియేటర్లలో తనిఖీలు, యజమానుల మూసివేతలు ఏపీలో వినోదరంగాన్ని కుదిపేస్తున్నాయి. సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి ప్రధానమయింది. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమాపై వివాదాలు నెలకొనడం.. క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడం కలవరం కలిగిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన నిబంధనలతో నష్టపోయేది ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో సినిమాలంటే 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు ఆడాలని భావించేవారు. కానీ ఇప్పుడు సినిమాలంటే మొదటి వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడంతా వెనక్కి వచ్చేయాలన్న ఫార్ములా అమలుచేస్తున్నారు.సినిమా హిట్ అయిందా ఫట్ అయిందా అని తెలిసేలోగానే పెట్టిన పెట్టుబడి రాబడుతున్నారు. అందులో భాగంగానే బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేయడమే కాకుండా.. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కానీ ఏపీలో టికెట్ ధరలు తగ్గించడం, బెనిఫిట్ షోలపై ఆంక్షలు సినిమా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నిబంధనలపేరుతో తనిఖీలు చేయిస్తోంది. లైసెన్స్ రెన్యువల్, ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, ఫారమ్-బి వంటి పత్రాల పేరుతో కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని థియేటర్లను సీజ్ చేయగా.. మరికొందరు యజమానులు తమ వల్ల కాదంటూ స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేశారు.దీంతో ఏపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం తన చర్యలను సమర్ధించుకుంటోంది. ప్రజలకు తక్కువ ధరకు వినోదాన్ని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకుంటే ఈ గోల ఉండదని పలువురు మంత్రులు చెబుతున్నారు. రూల్స్ అంటే అందరికీ ఒకటేనని అంటున్నారు. తాజా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కమిటీ నియమించింది.కమిటీ సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి పేర్ని నాని చెబుతున్నారు. కమిటీ పేరుతో కాలయాపన జరిగితే పెద్ద సినిమాల విడుదలపై సందిగ్ధత ఏర్పడక మానదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సంక్రాంతి సీజన్ లో సినిమాలకు బ్రేక్ పడనుంది.  ఫిబ్రవరిలో విడుదల కానున్న ఆచార్య, భీమ్లా నాయక్ వంటి సినిమాల భవిష్యత్తు ఆధారపడి వుంది. సినిమా టికెట్ల వివాదం త్వరగా సమసిపోతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts