హైదరాబాద్, జనవరి 7,
హైదరాబాద్ డ్రగ్స్ కేంద్రం గా మారుతుందా.. హైదరాబాదులో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ విరివిగా దొరుకుతున్నాయి. సంపన్నుల పిల్లలు చాలా వరకు డ్రగ్స్ కు అలవాటు పడ్డారా. కాలేజీలో డ్రగ్స్ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయిందా. సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సినిమా స్టార్స్ లో పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారా.. వీటన్నిటికీ హైదరాబాద్ పోలీసులు అవుననే సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే హైదరాబాదులో పెద్ద మొత్తంలో అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై మాఫియా హైదరాబాద్ లో తిష్ట వేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారుల విచారణలో బయట పడింది.అంతేకాకుండా డ్రగ్స్ మాఫియా లో కీలక పాత్ర పోషిస్తున్న నైజీరియన్ టోనీ అనే ఇందులో కీలక పాత్ర పోషించా డని పోలీసులు చెబుతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ముంబై హైదరాబాద్ పోలీసులకు దొరకకుండా టోనీ తిరుగుతున్నాడని అధికారులు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో అన్ని ముఖ్యమైన పట్టణాల్లో టోనీ తన ఏజెంట్లు పెట్టుకొని డ్రగ్స్ విషయాలు జరుగుతున్నట్టుగా పోలీసులు చెప్పారు. అంతే కాదు విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించి ముంబై లో ఉన్న తన ఏజెంట్స్ ద్వారా డ్రగ్స్ ను అన్ని పట్టణాల్లో విక్రయిస్తున్నట్లు గా పోలీసుల విచారణలో బయట పడింది. హైదరాబాద్ ,బెంగళూరు చెన్నై లాంటి ముఖ్యమైన పట్టణాల్లో టోనీ కు ఏజెంట్గా చాలామంది ఉన్నారని విచారణలో బయట పడింది. న్యూ ఇయర్ వేడుకల కోసం పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేయాలని ప్లాన్ చేసింది ఇందుకుగాను ముంబైకి కిలోలకు పైగా అని చెప్పించారు ఒక్కొక్క గ్రామంలో ప్యాక్ చేసి తన ఏజెంట్లు ఇచ్చాడు అక్కడి నుంచి ఏజెంట్ బస్సు ధర హైదరాబాద్ చెన్నై బెంగళూరుకు చేరుకున్నారు. ఈ మూడు పట్టణాల్లో ఉన్న ఓయో రూమ్స్ లో మకాం వేశారు.నగరంలో ఉండే కనీసం త్రీ స్టార్ హోటల్స్ లో ఈ ముఠా మకాం వేస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా హై ఫై స్టైల్ లో వీళ్ళు ఉంటారు. అయితే వీళ్ళకు ప్రత్యేకంగా కొంత మంది ఏజెంట్లు ప్రతి నగరాల్లో కూడా ఉన్నారు. స్థానికంగా ఉన్న వాళ్లకి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల తో పాటు కొన్ని ముఖ్యమైన సెలబ్రేషన్స్ కోసం టోనీ పెద్ద ఎత్తున విదేశాలనుంచి డ్రగ్స్ తేస్తున్నాడు. పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాడు. తన ఏజెంట్స్ ద్వారా అన్ని ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. అయితే హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు వచ్చిన సమాచారంతో టోనీ ముఠా పై నిఘా పెట్టారు. పది రోజుల క్రితం పంజాగుట్ట లో డ్రగ్స్ అమ్మడానికి వచ్చిన ఇద్దరిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని విచారించగా ప్రధాన నిందితుడు టోనీ అనీ తేలింది. దీంతో టోనీ నీ పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ముంబైలో మకాం వేశారు. దాదాపు పది రోజులపాటు మకాం వేసినప్పటికీ పోలీసులకు టోనీ చిక్కలేదు. అంతేకాకుండా స్థానికంగా ఉండే ముంబై పోలీసుల సహకారం కూడా తీసుకున్నారు . అయినప్పటికీ కూడా కి టోనీ కి సంబంధించిన సమాచారం పోలీసులకు అందలేదు. దీంతో తమ దగ్గర ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు ఇవ్వాళ పోలీసులు రిమాండ్ చేశారు.ముంబై లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో నివసించే ఇద్దరిని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి 83 గ్రాములు కొకైన్ స్వాధీనపర్చుకున్నారు. హైదరాబాద్ మార్కెట్లో 10 నుంచి 20 వేల రూపాయలకు ఒక గ్రాము అమ్ముతున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న చాలా మంది ప్రముఖులకు వీలు డ్రగ్స్ సప్లై చేసినట్లుగా పోలీసులు ఈ విషయంలో బయటపడింది. గత కొన్నాళ్ల నుంచి వీళ్లు హైదరాబాద్లో మకాం వేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు పోలీసుల వద్ద ఉన్న సమాచారం మేరకు దాదాపు 300 మంది పైగా కస్టమర్లు వీళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు అంటున్నారు. సంబంధించిన కచ్చితమైన సమాచారం తమ దగ్గర ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు.ఇందులో సినిమా సెలబ్రిటీలతో పాటు ప్రముఖ వ్యాపార వేత్తలు రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారని పోలీస్ కమిషనర్ చెప్పారు. ఎవరైతే డ్రగ్స్‌కు అలవాటు పడ్డారోవాళ్లందరిని కూడా త్వరలో అరెస్టు చేసేందుకు కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా డ్రగ్స్ తీసుకున్న వారిని కట్టడి చేయకపోతే అమ్మేవాళ్ళు నిత్యం హైదరాబాద్కు వస్తే ఉంటారని పోలీసులు అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్‌కు అలవాటు పడ్డ వారిని కొంత మందిని అరెస్ట్ చేయక తప్పదని పోలీస్ బాస్ అంటున్నారు. పోలీసుల దగ్గర ఉన్న చిట్టాలో వారు ఎవరు అనేది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మరో రెండు కేసులో కూడా పెద్ద ఎత్తున కొకైన్ అధికారులు స్వాధీనపర్చుకున్నారు..