అధికారులు అందరూ ఒకలా ఉండరు. బాగా పనిచేసే వాళ్ళని లైమ్ లైట్ లోకి తీసుకురండి. పని చేసే వాళ్ళని చూసి పనిచేయని వాళ్ళు కూడా లైన్లోకి వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలోఅయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసారు. టీమ్ లీడర్లు గా అందరినీ సమన్వయ పరుస్తూ ముందుకు వెళ్ళండి. అధికారులు ముప్పైఏళ్లు పైగా ఉద్యోగంలో ఉంటారు. ఒకసారి లైమ్ లైట్లో లేకపోయినా వాళ్ళకి ఏ నష్టం ఉండదు. కానీ రాజకీయ నాయకులుగా మనకి ఆ పరిస్థితి లేదని అన్నారు.మనం ఐదేళ్లు మాత్రమే ఉంటాము ఆ సంగతి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర పేరుతో రోడ్ల మీద తిరుగుతూ కథలు చెబుతున్నాడు. ప్రజలు ఎవరైనా అతనికి సమస్యలు చెబుతున్నారా అని అన్నారు. ఎవరూ అతనికి ఏ సమస్యలు చెప్పడం లేదు కారణం వారికి ఏ సమస్యలు లేవు. అదే నేను పాదయాత్ర చేసినప్పుడు ఏ ఊరుకెళ్లినా సరే జనాలు నా దగ్గరకి వచ్చి సమస్యలు చెప్పేవారు. నాలుగేళ్ళ పనితీరు పై నేతలంతా సమీక్షించుకోవాలి. కొంతమంది నాయకులు బాగా పని చేస్తుంటే మరికొంతమంది ఇంకా బాగా పిక్ అప్ కావాల్సి ఉంది. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ఆరోపణలు నాయకులు తిప్పికొట్టాలి. అలాంటి తప్పుడు ప్రచారాన్ని కొంతమందైనా సరే నమ్ముతారు. అందువల్ల మనం వాస్తవం ఏంటో ప్రజలకి సరిగా చెప్పాలని అన్నారు.