హైదరాబాద్, జనవరి 7,
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై గత కొన్ని రోజుల వాడీవేడిగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీన్‌లోకి డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎంటర్ కావడంతో ఈ విషయం కాస్త పీక్స్‌కు చేరింది. దీంతో ఈ విషయం ఏపీ ప్రభుత్వం, ఆర్జీవీ మధ్య ఫైట్‌గా మారింది. అయితే.. గత కొన్ని రోజుల నుంచి టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. మరో సంచలన ట్విట్ చేశారు. ఈ సారి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి ఉద్భోద చేశారు. మీ చుట్టూ వైసీపీ నేతలతో జాగ్రత్త అంటూ సూచించారు. వైసీపీ నేతలు సీఎం జగన్‌ను తప్పు దారి పట్టిస్తున్నారంటూ పేర్కొన్నారు.వైసీపీ నేతలు సీఎం జగన్ చుట్టూ ఉంటూనే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన్ను తప్పుదారి పట్టిస్తున్నారని వర్మ ట్విట్‌లో రాశారు. ఇకనైనా తన చుట్టూ ఉన్న ప్రమాదకర వ్యక్తుల పట్ల జగన్ అప్రమత్తంగా ఉంటారని నమ్ముతున్నా.. అని పేర్కొన్నారు. అయితే, ఆపార్టీలో గౌరవించే ఒకే ఒక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అని ఆర్జీవీ పేర్కొన్నారు. కాగా.. వర్మ ఈ ట్విట్‌తో ఏపీ రాజకీయాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా వర్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పలువురిని ఉద్దేశించే ఈ ట్విట్ చేశారంటూ పేర్కొంటున్నారు.