కడప, జనవరి 7
సంస్కృతీ, సంప్రదాయాల మేళవింపు, చేనేత కార్మికుల కళా నైపుణ్యం.. ఆప్కో వస్త్రాల సొంతం.. అని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి అభివర్ణించారు. శుక్రవారం రాష్ట్ర చేనేత, జౌళి సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నగరంలోని వన్ టౌన్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అధునాతన "ఆప్కో" చేనేత వస్త్రాలయాన్ని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి.. జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్షి, రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ కార్పొరేషన్ చైర్ పర్సన్ జింక విజయలక్ష్మి, రాష్ట్ర ఆప్కో సంస్థ చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహన్ రావు, ఆర్డీవో ధర్మచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. * ఈ సందర్బంగా.. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా మగ్గం వృత్తిని, సంప్రదాయ కళనే నమ్ముకుని జీవించే.. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోవిధాలుగా బాసటగా నిలిచిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ హయాంలో.. చేనేత వస్త్రాలకు అపురూపమైన ఆధారణ కల్పించారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఒకరోజు ఖచ్చితంగా చేనేత వస్త్రాలు ధరించాలనే నిబంధన కూడా ఉండేదన్నారు. అదే బాటలో.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేనేత వస్త్రాలకు ప్రపంచస్థాయి గుర్తింపును తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం హాండ్ లూమ్ మరియు హ్యాండి క్రాఫ్ట్ (జౌళి, హస్తకళలు) ఉత్పత్తిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలను చేకూర్చే ఈ-మార్కెటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా నాణ్యతతో కూడిన ఉత్పత్తి, మార్కెటింగ్, పేమెంట్ బ్రిడ్జి అనే మూడు ప్లాట్ ఫాముల ద్వారా నిర్వహించడం జరుగుతోందన్నారు.
*ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేనేత కళాకారులు, ఉత్పత్తులకు మంచి మార్కెట్ ధరలు, చేనేత కుటుంబాల ఆర్థికాభి వృద్ధి కోసం ఆప్కో సంస్థను రాష్ట్రn ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 ఆప్కో వస్త్రాలయలు ఏర్పాటు చేయగా.. కడప నగరంలో 151 వస్త్రాలయాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు. ఆర్థికంగా చితికిపోయి.. కుటుంబ పోషణ కూడా బరువవుతున్న చేనేత కార్మికులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆపన్నe3 హస్తం అందిస్తున్నారన్నారు. చేనేత కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం.. నాలుగు రకాలైన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. వారి అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు.
* కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేనేత వృత్తిని ప్రోత్సహించడానికి వివిధ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. వారి ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించడానికే రాష్ట్ర ప్రభుత్వం ఆప్కో ప్రవేశ పెట్టిందన్నారు. నేతన్నలు తయారు చేసిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేసి విక్రయిస్తుందన్నారు. కష్టపడి తయారు చేసిన చేనేత ఉత్పత్తులను ఉత్పత్తి ధరకే ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాలుగా కార్మికులకు రాయితీలు ఇస్తుందని వివరించారు. ప్రతి వస్త్రంపై 30% రాయితీతో అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కడప నగర నడిబొడ్డున కొనుగోలుదారులపై ఎలాంటి అసౌకర్యాలు లేకుండా.. అధునాతన వసతులతో.. అందరినీ ఆకట్టుకునేలా.. సంప్రదాయ వస్త్ర ప్రపంచం మన ముంగిలిలో ఏర్పాటు కావడం జిల్లా ప్రజల అదృష్టం అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, చేనేత వస్త్రాల కొనుగోలుతో నేతన్నలను ఆదుకోవాలన్నారు.
*ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్షి, రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ కార్పొరేషన్ చైర్ పర్సన్ జింక విజయలక్ష్మిలు మాట్లాడుతూ.. మగ్గం వున్న ప్రతి నేత కుటుంబానికి ఏడాదికి " వైఎస్ఆర్ నేతన్న నేస్తం"
పథకం ద్వారా రూ.24000 ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. అలాగే.. గత ప్రభుత్వం ఆప్కో సంస్థకు బకాయిపడ్డ కోట్లాది రూపాయల మొత్తంతో పాటు కోవిడ్-19 నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అందించే ఉచిత మాస్కుల తయారీకి కూడా కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి చేనేత కార్మిక కుటుంబాల్లోనే నవ చైతన్యాన్ని నింపిందన్నారు.
ఈ కార్యక్రమంలో అనుడా ఛైర్మెన్ గురుమోహన్, కడప డిప్యూటీ మేయర్లు నిత్యానందరెడ్డి, ముంతాజ్ బేగం, జిల్లా చేనేత జౌలు శాఖ సంబందిత అధికారులు, జిల్లా చేనేత సహకార సంఘాల సభ్యులు, ఆప్కో సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.