YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌ జనవరి 7
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం నుంచి తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు 4,318 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్‌ ఆర్‌టీసీ ప్రకటించింది.ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు బస్సులను ప్రారంబించినట్లు  టీఎస్‌ ఆర్టీసీ సంస్థ ప్రకటించింది.పండుగ సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది.హైదరాబాద్‌ మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, సీబీఎస్‌, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్‌.బి.నగర్, ఆరాంఘర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్‌, కె.పి.హెచ్.బి, ఎస్‌ఆర్‌ నగర్, అమీర్ పేట, టెలిఫోన్ భవన్, దిల్‌సుఖ్‌నగర్‌ పాయింట్లతో పాటు జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేసింది.ప్రత్యేక బస్సుల పర్యవేక్షణకు సుమారు 200 మంది అధికారులు, ఉద్యోగులను అందుబాటులో ఉంచారు.ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.*www.tsrtconline.in వెబ్ సైట్ లో రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు హైదరాబాద్‌లోని వివిధ పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.*నగరంలోని బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, దిల్‌సుఖ్‌నగర్‌, ఈసీఐఎల్‌, ఎల్‌బీ నగర్, ఆరాంఘర్ పాయింట్ల నుంచి ఏపీకి బస్సులు నడుపుతున్నామని టీఎస్‌ ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Related Posts