YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

9.2 శాతానికి చేరిన వృద్ధి రేటు

9.2 శాతానికి చేరిన వృద్ధి రేటు

ముంబై, జనవరి 19,
మన ఎకానమీ దూసుకెళ్తోంది. కొవిడ్ ముందుకంటే గ్రోత్లో వేగం పెరిగింది. వ్యవసాయం, మైనింగ్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ల పెర్ఫార్మెన్స్ మెరుగుపడటంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్ (2021–22)లో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీపీ) గ్రోత్ 9.2 శాతానికి చేరుతుందని ప్రభుత్వం విడుదల చేసిన డేటా వెల్లడిస్తోంది. కొవిడ్ వైరస్ వల్ల దేశమంతటా లాక్డౌన్ను అమలు చేయడంతో 2020–21లో ఎకానమీ 7.3 శాతం కుదించుకుపోయిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ప్రతి క్వార్టర్లోనూ ఎకానమీ క్రమంగా వేగం పుంజుకుంటోందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ తెలిపింది.  అన్ని రంగాలలోనూ గ్రోత్ కనిపిస్తున్నట్లు  ఎన్ఎస్ఓ రిలీజ్ చేసిన డేటా వెల్లడిస్తోంది. 2021–22లో జీడీపీ రూ. 147.54 లక్షల కోట్లకు చేరుతుందని ఎన్ఎస్ఓ అంచనా వేస్తోంది. ఈ జీడీపీ 2020–21లో రూ. 135.13 లక్షల కోట్లు మాత్రమే. దీంతో ప్రి కొవిడ్ లెవెల్ అంటే 2019–20 నాటి రూ. 145.69 లక్షల కోట్ల కంటే మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. కరోనా వల్ల మార్చి 2020లో దేశమంతటా లాక్డౌన్ ప్రకటించారు. దీంతో 2020–21 గ్రోత్ రేట్ బాగా పడిపోయింది.  ఆర్బీఐ ఈ ఫైనాన్షియల్ ఇయర్కు ప్రకటించిన గ్రోత్ అంచనాల కంటే ఎన్ఎస్ఓ అంచనాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. 2021–22లో గ్రోత్ రేటు 9.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో మాన్యుఫాక్చరింగ్ గ్రోత్ 12.5 శాతానికి పెరుగుతుందని ఎన్ఎస్ఓ అంచనా వేస్తోంది.  మైనింగ్ రంగంలోనూ ఈ ఏడాది మంచి గ్రోత్ 14.3 శాతం, ట్రేడ్, హోటళ్లు, ట్రాన్స్పోర్టు, బ్రాడ్కాస్టింగ్ సంబంధ కమ్యూనికేషన్ అండ్ సర్వీసెస్ కూడా 11.9 శాతం గ్రోత్ సాధిస్తాయని ఎన్ఎస్ఓ ఎస్టిమేట్ చేస్తోంది. ఇక వ్యవసాయ రంగం 3.9 శాతం పెరుగుతుందని వెల్లడించింది.

Related Posts