YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇంఛార్జ్‌ పదవి ఆశిస్తున్నవాళ్లంతా అమరావతికి క్యూ..!

ఇంఛార్జ్‌ పదవి ఆశిస్తున్నవాళ్లంతా అమరావతికి క్యూ..!

కాకినాడ, జనవరి 10,
వర్గ విభేదాలు ఆ నియోజకవర్గం టీడీపీలో చిచ్చు పెట్టాయా? కొత్తగా వచ్చే ఇంఛార్జ్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోందా? ప్రస్తుత ఇంఛార్జ్‌ తగ్గేదే లేదని చెబుతున్నారా? ఇద్దరు మాజీ మంత్రుల ఎత్తుగడ మధ్య టీడీపీ రాజకీయం మలుపులు తిరుగుతోందా?తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ టీడీపీ కొత్త ఇంఛార్జ్‌ ఎవరు? ఈ విషయంలో టీడీపీ అధిష్ఠానం ఎందుకు సస్పెన్స్‌ కొనసాగిస్తోంది? ఆ నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లకు అర్థం కావడం లేదట. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రస్తుతం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆమెకు.. ఆమె భర్త సత్తిబాబుకు చెక్‌ పెట్టాలని మాజీ మంత్రి చినరాజప్ప వర్గం పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వర్గంగా పిల్లి కుటుంబంపై ముద్ర ఉంది. దీంతో ఇక్కడ ఇద్దరు మాజీ మంత్రుల్లో ఎవరి మాట నెగ్గుతుందన్నది ఆసక్తిగా మారింది. ఈ ఆధిపత్య పోరు కారణంగానే కొత్త ఇంఛార్జ్‌ను తేల్చడం లేదనే అనుమానాలు ఉన్నాయట ఎన్నికల్లో ఓడిన తర్వాత నియోజకవర్గాన్ని పిల్లి కుటుంబం వదిలేసిందనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. వైసీపీతో ఢీ అండే ఢీ అనే స్థాయిలో పోరాటాలు లేవన్నది టీడీపీలోని పిల్లి ప్రత్యర్థుల ఆరోపణ. పైగా తెర వెనక వైసీపీతో సత్సంబంధాలు ఉన్నాయని టీడీపీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయట. ఇదే సమయంలో సత్తిబాబు కుటుంబానికి చెందిన కొందరు తాము వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతిస్తామని చెప్పి ఆడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వీటన్నింటిని గమనించిన చినరాజప్ప వర్గం స్పీడ్‌ పెంచింది. ఇంఛార్జ్‌ను మార్చాలనే డిమాండ్‌ చర్చకు పెట్టేశారు. అయితే తాము టీడీపీని వీడబోమని.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబులు తమ నేత యనమలకు స్పష్టం చేశారటఆ మధ్య జరిగిన కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉపఎన్నికలో 3వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ను చివరిక్షణంలో విత్‌డ్రా చేసుకోవడంతో సత్తిబాబుపై విమర్శలు వచ్చాయి. దీనిపై చినరాజప్ప వర్గం టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేసింది కూడా. కొత్త ఇంఛార్జ్‌ను నియమించకపోతే.. రూరల్‌ నియోజకవర్గంలో టీడీపీ అడ్రస్సే లేకుండా పోతుందనే వాదన చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారట. ఇవన్నీ చూసిన పిల్లి వర్గం కూడా స్వరం సవరించుకుంది. సొంత సామాజికవర్గానికి ఇంఛార్జ్‌ పదవి ఇప్పించుకునేందుకే చినరాజప్ప తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతోంది. గతంలో కూడా ఇక్కడి టీడీపీలో వర్గపోరు నడిచినా.. పెద్దగా రోడ్డెక్కిన పరిస్థితులు లేవు.నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెట్టడానికి ఇంఛార్జ్‌ మార్పునకే చంద్రబాబు మొగ్గు చూపొచ్చన్నది టీడీపీ వర్గాల మాట. ఎవరైతే ఇంఛార్జ్‌ పదవి ఆశిస్తున్నారో వారంతా టీడీపీ పెద్దల దగ్గరకు వెళ్లి చెప్పాల్సింది చెప్పి వస్తున్నారట. ఇద్దరు మాజీ మంత్రుల మధ్య ఆధిపత్యపోరు కావడంతో సమస్యను చంద్రబాబు తేలిగ్గా పరిష్కరిస్తారా? లేక నాన్చివేత ధోరణిలో ఉంటారా అన్నది ప్రశ్న.

Related Posts