YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఈబీసికి నేస్తానికి ..గుడ్ బై....?

ఈబీసికి నేస్తానికి ..గుడ్ బై....?

నెల్లూరు, జనవరి 10,
మాట తప్పను.. మడమ తిప్పను... ఇది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రధాన నినాదం. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చితీరుతానని చెప్పారు. కాని ఇప్పుడు సీఎంగా మడమ తిప్పడమే ఆయన ముఖ్య నినాదంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా హామీలకు ఆయన మంగళం పాడేశారు. మద్యపాన నిషేదం హామీని గంగలో కలిపి... జనాలను మద్యం తాగించడమే లక్ష్యంగా ఆయన పాలన సాగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే అమ్మఒడికి 2021-21 సంవత్సరానికి గాని ఎగనామం పెట్టేశారు. తాజాగా ఈబీసీ నేస్తం పథకానికి హ్యాండిచ్చేశారు జగన్ రెడ్డి. ఈబీసీ పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో జనవరి 10న నిధులు జమ చేయాల్సి ఉంది. ఇందుకోసం నంద్యాలలో భారీ సభకూ ఏర్పాట్లు చేశారు. కాని చేతిలో కాసులు లేకపోవడంతో ఆపేశారు. నిధుల కోసం ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులను తీసుకుని ఢిల్లీకి వెళ్లారు. అప్పుకోసం కేంద్రాన్ని విన్నవించుకుంటున్నారు. కేంద్రం కరుణిస్తే మంగళవారం నిధులు లేదంటే ఈబీసీ నేస్తం లేనట్టేనని అధికారులు చెబుతున్నారు.ఈబీసీ నేస్తం’ పథకంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన 45 సంవత్సరాలు దాటిన ఓసీ మహిళలకు ఏటా రూ.15వేలు అందించాలని నిర్ణయించారు. ఈ పథకానికి రూ.600 కోట్ల నుంచి రూ.650 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. గత సోమవారం సీఎం జగన్‌ ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిసి అప్పుల అనుమతి కోసం విజ్ఞప్తి చేసుకోగా  రాత్రికి రాత్రే రూ.2500 కోట్ల అప్పు పుట్టింది. వచ్చింది వచ్చినట్లుగా ఆ మొత్తాన్ని ఒక్కరోజులోనే ఖర్చు పెట్టేశారు. అయినా అప్పులు ఈజీగా పుడతాయని, ‘ఈబీసీ నేస్తం’ అమలు చేయవచ్చునని భావించారు. ఆర్థిక మంత్రి, సెక్రటరీలు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఈ నెల 10న ఈబీసీ నేస్తం పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో భారీ సభను ఏర్పాటు చేశారు. కానీ  ప్రభుత్వం అనుకున్నట్లుగా కొత్త అప్పు పుట్టలేదు. ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో, అనుకున్న సమయానికి అప్పు కూడా అందకపోవడంతో ఈబీసీ నేస్తం పథకాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు.కొత్త అప్పులకు అనుమతిచ్చిన వారానికే మళ్లీ మరింత అప్పు కోసం ఢిల్లీ యాత్రలు మొదలుపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌, ఆర్థిక శాఖ సెక్రటరీ సత్యనారాయణతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ అధికారులను కలిసి అప్పుల కోసం విన్నపాలు చేసుకోనున్నారు. కేంద్రం కరుణించి అనుమతిస్తే మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని రుణం తెచ్చుకుంటారు. ఆ మొత్తంతో ఈబీసీ నేస్తం పథకం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే గురువారం రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం రూ.1430 కోట్లు ఇచ్చింది. ఆ డబ్బులతో ఈబీసీ నేస్తం పథకం అమలు చేస్తారని అంతా భావించారు. కానీ వాటిని ప్రభుత్వం వేరే అవసరాలకు వాడడంతో ఈబీసీ నేస్తం పథకానికి డబ్బుల్లేకుండా పోయాయి. ఇప్పుడు మంత్రి, సెక్రటరీల ఢిల్లీ యాత్ర ఫలించి అప్పులకు అనుమతి వస్తేనే ఈబీసీ పథకం ఉంటుందని లేదంటే వాయిదా కొనసాగుతుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు.

Related Posts