విశాఖపట్టణం, జనవరి 10,
విశాఖతీరంలో రచ్చకు కారణమైన రింగు వలల వివాదానికి.. పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఫైట్ సీన్ నుంచి చర్చల వరకు వచ్చింది. మత్స్యకారుల పంచాయితీ. ఈనెల 20లోపు దీనికొక సామరస్యమైన పరిష్కారం లభిస్తుందని మంత్రి సీదిర అప్పలర్రాజు చెప్పారు . ఇప్పటికే దీనిపై కమిటీ వేశామనీ.. గతంలో మాదిరి.. ఏ ఇబ్బంది లేకుండా వేటకు వెళ్లేలా చర్యలు తీసుకుంటుందనీ చెప్పారు.విశాఖ కలెక్టరేట్‌లో రింగ్ వలల వివాదాన్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వం.. ఎట్టకేలకు సఫలీకృతమైనట్టే కనిపిస్తోంది. మంత్రులు కన్నబాబు, సీదిరి అప్పల్రాజు, అవంతి శ్రీనివాస్‌తోపాటు ఎంపీ విజయ సాయిరెడ్డి.. కీలక సమావేశం నిర్వహించారు. అటు మత్స్యకారులతో, ఇటు అధికారులతో మాట్లాడి.. సమస్య పరిష్కారంపై చర్చించారు. రింగ్ వలలను శాశ్వతంగా నిషేధించాలనీ… సాంప్రదాయవలల్ని వినియోగించే పెదజాలరిపేట వాసులు కోరారు. అయితే, 8 నాటికన్ మైళ్ల తర్వాత ఫిషింగ్‌కి అనుమతించాలని రింగ్ వలలు ఉపయోగించే మంగమారిపేట, ఎండాలజాలరిపేట మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. దీంతో, ఇరువర్గాలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. దీనిపై ఫిషరీస్, పోలీస్ ఉన్నతాధికారులతో.. ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసిందివిశాఖ తీరంలో కొన్నేళ్లుగా సాంప్రదాయ వలలు వర్సెస్ రింగ్ వలల వివాదం… మత్స్యకార గ్రామాల మధ్య చిచ్చురేపుతోంది. తాజాగా ఎండాల జాలరిపేట, మంగామారిపేట, పెదజాలరిపేట మత్స్యకారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సముద్రంలో వార్‌ను తలపించేలా ఫైట్ సీన్ కొనసాగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు మత్స్యకారులు. పోలీసులు 144 సెక్షన్ విధించి గొడవ సద్దుమణిగేలా చేశారు. కొన్ని రోజులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఆపేశారు. దీంతో, సమస్యను పరిష్కరించాలని నిర్ణయించిన సర్కార్..