YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సంక్రాంతికి కరోనా.. ఆతిధ్యమేనా

సంక్రాంతికి కరోనా.. ఆతిధ్యమేనా

కాకినాడ, జనవరి 11,
ఉరుకుల పరుగుల జీవితాలు.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు.. నిద్రలోనూ.. భవిష్యత్‌ కార్యచరణపై ఆలోచనలతో సాగిపోతున్న వేళ.. కనివిని ఎరుగని రీతిలో కరోనా మహమ్మారి దెబ్బకొట్టింది. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా ధాటికి ఎన్నో కుటుంబాలు కకావికలమయ్యాయి. కరోనా దెబ్బకు అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనా ముందు మోకరిళ్లింది అనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కట్టడికి కోవిడ్‌ నిబంధనలు పెట్టి, ఆఖరికి ప్రజలందరి కాళ్లకు లాక్‌డౌన్‌తో బంధం వేసినా కరోనా అదుపులోకి రాలేదు.కరోనాను జయించే సంజీవిని కోవిడ్‌ టీకాలు పంపణీ కార్యక్రమం మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కరోనా కట్టడికి అడుగులు వేశాయి. దీంతో కరోనా రక్కసి రెక్కలు కట్‌ చేసినట్లుగా దేశంలో తగ్గుముఖం పట్టింది. అయితే కరోనా నుంచి కోలుకుంటున్నామని ఆనందపడేలోపే.. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లోకి ప్రవేశించింది. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తితో తగ్గుముఖం పట్టిన కరోనా రక్కిసి రెక్కలు మరోసారి చాస్తోంది. మొన్నటి క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలతోనే కరోనా కేసులు ఒక్కసారిగా భారీస్థాయిలో పెరిగిపోతున్నాయి. క్రిస్మస్‌కు ముందు దేశవ్యాప్తంగా 20 వేలలోపు ఉన్న కరోనా కేసులు ప్రస్తుతం 1.50 లక్షల పై చిలుకు నమోదవుతున్నాయంటే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థచేసుకోవచ్చు.అయితే గత రెండు సంవత్సరాలు కరోనా ప్రభావంతో అన్ని పండుగలు మొక్కుబడిగా జరుపుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈసారి కరోనా వచ్చినా.. ఒమిక్రాన్‌ వచ్చినా.. తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తెలుగువారికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో సంక్రాతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పండగు వస్తుందంటే చాలు.. దేశంలో ఏ చోట ఉన్నా.. అంతేందుకు ప్రపంచంలో ఏ చోటా ఉన్నా.. ఈ పండుగకు ఇంటికి చేరుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతుంటారు. ఎంతో ఆనందంగా అందరూ వేచిచూస్తున్న సంక్రాంతి పండుగ పట్టుమని పది రోజులు కూడా లేదు.ఈ సమయంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి.. కరోనా కేసులు పెరగడం చూస్తుంటే.. ఈ సారి సంక్రాంతి తరువాత కరోనా కేసులు బీభత్సంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఏదేమైనా ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉన్న వారు సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన అందరూ కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బంధుమిత్రులతో సంక్రాంతి పండుగను జరుపుకోవాల్సిందే..

Related Posts