తిరుపతిలో వేంకటేశ్వరుని దర్శనానికి వచ్చిన అమిత్ షా పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి దూరదుష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. వేంకటేశ్వర స్వామి భక్తులపై జరిపిన దాడిగా భావించాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో నూ వేలమంది తెలంగాణ భక్తులు దర్శనం చేసుకునేవారు. కానీ తిరుపతిలో దాడి జరిగిన పరిస్థితి లేదు. నైతిక పతనం.. పాలక పార్టీ, చంద్రబాబు బాధ్యత వహించాలని అయన అన్నారు. అమిత్ షా రెండో వాహనం అద్దాలు మిగిలాయి. తిరుపతి చరిత్రలోనే మొదటిసారి. చంద్రబాబు అవకాశవాద వైఖరి తెలుగుప్రజలు గమనించాలి. కర్ణాటక ఎన్నికల తర్వాత అవినీతిని బయట పెడతారని భయపడుతున్నారు. ప్రత్యేక హోదా పై విశ్వాసం లేదు. ఆయన ప్రేమంతా 2019లో కుర్చీ నిలబెట్టు కోవటంపైనే ఉంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకుంటున్నారని విమర్శించారు. దాడి సమయంలో పోలీస్ లు ప్రేక్షక పాత్ర వహించారు. చంద్రబాబు నాయుడుకు తెలిసే అమిత్ షా పై దాడి జరిగింది. దాడి జరిగినందుకు చంద్రబాబు బహిరంగంగా అమిత్ షాకు క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేసారు.