YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

షాపై దాడిని తప్పుపట్టిన చంద్రబాబు

షాపై దాడిని తప్పుపట్టిన చంద్రబాబు

అమిత్ షా కాన్వాయ్‌పై జరిగిన రాళ్లదాడిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి దాడులతో పార్టీకి చెడ్డపేరు తీసురావొద్దని... పార్టీ అధికారంలో ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదని గుర్తు చేశారట. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరోవైపు ఈ ఘటనపై ఆరా తీసిన బాబు... చిత్తూరు జిల్లా నేతలతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై హోంమంత్రి చినరాజప్ప కూడా స్పందించారు. అమిత్ షా కారుపై దాడి జరగలేదని... వెనుక ఉన్న కారుపై రాయి పడిందని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టడంతో... టీడీపీ కార్యకర్తలు కూడా ప్రతిఘటించారని సమాచారం ఉందన్నారు.ఉదయం అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు. కాన్వాయ్ కొండపైకి వెళుతుండగా... టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈలోపు బీజేపీ కార్యకర్తలు వారిని ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సర్థిచెప్పడంతో గొడవ సద్ధుమణిగింది.

Related Posts