పగిడ్యాల
పగిడ్యాల మండలం లోని నెహ్రూ నగర్ గ్రామ సమిపంలొని శ్రీశైలం బ్యాక్ వాటర్ బోటు ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని ప్రయాణికులు చర్శించుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు శ్రీశైలం బ్యాక్ వాటర్ పరివాహక ప్రాంతాలు అయినటువంటి పగిడ్యాల మండలంలోని వివిధ గ్రామాల్లో అదేవిధంగా తెలంగాణ కొల్లాపూర్ సమీపంలోని సోమశిల.మంచాలకట్ట. తాండ. కొప్పునూరు. అయ్యవారిపల్లె. పెద్దమారు.చేల్ల పాడు.చిన్నమారు. కాలూరు. సింగోటం. పెంట్లవెల్లి. నాయిని పల్లె. గుమ్మడం. ఎల్లూరు. నందికొట్కూరు తాలుకా లోని బిజినవేముల. మిడుతూరు. గడివేముల. కుర్ర పోలూరు. నాగలూటి. పాములపాడు. ఎర్ర మఠం.కురుకుంద. నెహ్రూ నగర్. ప్రాత కోట. లక్ష్మాపురం.నాగటూరు. చెప్పుకుంటూ పొతే ఎన్నో ఇలాంటి గ్రామాల నుండి నదీ పరివాహక ప్రాంతం నుండి సుమారు 30 నిమిషాల బోటు ప్రయాణం ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ లో నెహ్రు నగర్ మరియు చేల్ల పాడు. నెహ్రూ నగర్ మరియు మంచాలకట్ట కు బోటు ప్రయాణం ద్వారా ప్రయాణికులు వారి వారి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. కానీ ముఖ్యంగా చెప్పాలంటే సింగోటం లక్ష్మీ నరసింహ స్వామి జాతర సందర్భముగా బోటు ప్రయాణం ఎలా కొనసాగుతుందో కాని కొంతమంది లక్ష్మి నరసింహ స్వామి భక్తాదులు నెమరు వేసుకుంటున్నారు. సుమారు గత కొన్ని సంవత్సరాల క్రితం లక్ష్మీ నరసింహ స్వామి జాతర కు వెళ్లే భక్తులు మూర్వకొండ బొటూ ఘాటు నుండి లక్ష్మీ నరసింహస్వామి జాతరకు వెళ్లే భక్తులు దాదాపుగా అరవై మంది జల సమాధి అయినా సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ కొంతమంది స్వార్థ ప్రయోజనం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వినిపిస్తోంది.. ముఖ్యంగా చెప్పాలంటే ఘాటు బోటు నిర్వాహకులకు ఎలాంటి బోట్లకు లైసెన్సులు. పర్మిమ్టిలు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుడబ్బులు పోగు చేసుకుంటున్నారని వినిపిస్తోంది.