అనంతపురం
అనంతపురం జిల్లా కనేకల్ మండల కేంద్రంలోని హెచ్ ఎల్ సి కెనాల్ వద్ద కనేకల్ కి చెందిన టాటా ఏస్ వాహన దారుడు వాహనాన్ని వాటర్ వాష్ చేయడానికి తన స్నేహితుడు తో పాటు హెచ్ ఎల్ సి కెనాల్ వద్ద కు నిన్న రాత్రి తీసుకెళ్లాడు. వాహనాన్ని వాటర్ వాష్ చేసిన అనంతరం వాహనాన్ని స్టార్ట్ చేసి రివర్స్ చేయబోయి ప్రమాదవశాత్తు కాలువ లోకి దూసుకెళ్లింది అది గమనించిన తన స్నేహితుడు హుటాహుటిన గ్రామంలోకి వెళ్లి సమాచారం తెలపడంతో స్థానికులు జెసిబి ని పిలిపించి జెసిబి సహాయంతో కాలువలోకి పడిపోయిన వాహనాన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో వాహనం పాక్షికంగా దెబ్బతింది. డ్రైవర్ అప్రమత్తమై కిందికి దూకడంతో ప్రమాదం తప్పింది.