హైదరాబాద్
హైదరాబాద్లోని ఎంపి రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు అంటించారు. బుధవారం నాడు గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి చేరుకున్న ఏపీ సీఐడీ పోలీసులు, రఘురామకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈనెల 17 న విజయవాడ సిఐడి ఆఫీస్ కు విచారాణకు రావాలని రఘురామకు నోటీసులు జారీ చేసారు. అయితే, సిఐడి అధికారులకు ఎంపి ఇంటిలోకి అనుమతించకపోవడంతో ఇంటి బయటే ఎదురుచూసారు.