హైదరాబాద్, జనవరి 13,
సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బలుపుతో చేసిన కామెంట్లంటూ సినిమా వాళ్లు మండిపడుతున్నారు. అది అలా కంటిన్యూ అవుతుండగానే.. వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి.. రెడ్డి రాజకీయం మొదలుపెట్టేశారు. పుష్ప నిర్మాతలు కమ్మ వారు కాబట్టే.. కావాలనే ఆ మూవీలో రెడ్లను విలన్లుగా చూపించారంటూ క్యాస్ట్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. అది మరింత రచ్చకు దారితీసింది. దీనిపై ఫిల్మ్ ఇండస్ట్రీ మండిపడుతోంది. సోషల్ మీడియాలో వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ నేత రవిచంద్రారెడ్డి ఓ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో ముగ్గురు అన్నదమ్ములను విలన్లుగా చూపించారని.. కొండారెడ్డి, జక్కారెడ్డి, జాలిరెడ్డి అని కావాలనే విలన్లకు అలా రెడ్డి పేర్లను పెట్టారని మండిపడ్డారు. ఈ సినిమా నిర్మాతలు కమ్మ వర్గానికి చెందిన వారిని, హీరో కాపు అని.. అందుకే ఉద్దేశపూర్వకంగానే విలన్లకు రెడ్డి పేర్లు పెట్టారనేది రవిచంద్రారెడ్డి ఆరోపణ. సిల్లీ కాకపోతే మరేంటి. ఆయనకేమైనా మతి పోయిందా.. లేక, జగన్‌రెడ్డి మెప్పు కోసం కావాలనే ఇలా రెడ్డి రాజకీయం చేస్తున్నారా? అంటూ ఇండస్ట్రీకి సపోర్ట్‌గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాంటి పోస్టుల్లో కొన్నిటిని నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ రీట్వీట్ చేయడంతో మరింత వైరల్‌గా మారాయి.సైరా నరసింహారెడ్డి.. ఇంద్రసేనారెడ్డి.. సమర సింహరెడ్డి.. అని హీరో పాత్రలకు రెడ్డి పేర్లు పెట్టి గతంలో అగ్ర హీరోలు సినిమాలు తీయలేదా? రెడ్లను హీరోలుగా చూపించలేదా? అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని.. మీ కుల గజ్జి ఇండస్ట్రీకి ఎందుకు ఆపాదిస్తారంటూ.. వైసీపీ నేతపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.సమర సింహారెడ్డి సినిమా హీరో బాలకృష్ణ, దర్శకుడు బి.గోపాల్ కమ్మ వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. హీరో క్యారెక్టర్‌కి రెడ్డి పేరు పెట్టి హీరోయిజం ఎలివేట్ చేశారని గుర్తు చేస్తున్నారు. ఇక, ఇంద్ర సినిమాలో ఇంద్రసేనారెడ్డి పేరుతో కాపు వాడైన చిరంజీవి.. కమ్మ కులానికి చెందిన నిర్మాత అశ్వినీదత్.. రెడ్డి పేరుతో హిట్ సినిమా ఇచ్చారని.. అలానే, సైరా సినిమాలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి క్యారెక్టర్‌కు ప్రాధాన్యత కల్పించారని.. అలాంటప్పుడు ఇప్పుడేదో పుష్ప సినిమాలో విలన్లకు రెడ్ల పేర్లు పెట్టడాన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారని నెటిజన్లు వైసీపీని కుమ్మేస్తున్నారు. మీ కుల గజ్జిని.. సినిమా వాళ్లకు అంటించ వద్దని.. రెడ్డి పేరుతో రాజకీయం చేయడం తగదని గట్టిగానే చెబుతున్నారు.