YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

మరింత తగ్గిన వంట నూనెల ధరలు

మరింత తగ్గిన వంట నూనెల ధరలు

హైదరాబాద్, జనవరి 13,
ప్రస్తుతం వంట నూనె ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యవసర సరుకుల ధరలతో సతమతమవుతున్న జనాలకు వంటనూనె ధరలు ఊరట కలిగిస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఇబ్బందులకు గురవుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దేశంలో రిటైల్‌ మార్కెట్లో వంట నూనె ధరలు భారీగా తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. కిలో వంటనూనెపై రూ.20 వరకు తగ్గినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. అంతర్జాతీయంగా మార్కెట్లో కమోడిటీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, వంట నూనెల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికి దిగి వచ్చిన ధరలు.. తాజాగా మరింత తగ్గుముఖం పట్టాయి. గత సంవత్సరం భారీగా ఉన్న నూనె ధరలు.. అక్టోబర్‌ 2021 నుంచి తగ్గుతూ వస్తున్నాయి.వేరుశనగ నూనె ధర కిలోకు రూ.180 వరకు ఉండగా, మస్టర్డ్ ఆయిల్ ధర రూ.184.59గా ఉన్నట్టు తాజా డేటాలో వెల్లడైంది. అలాగే సోయా నూనె ధర రూ.148.85గా, పామాయిల్ ధర రూ.128.5గా, పొద్దుతిరుగుడు నూనెధర రూ.162.4గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వంటనూనె కంపెనీలు, అదనీ విల్మర్‌ రుచి ఇండస్ట్రీస్‌ రెండు కంపెనీలు కూడా ధరలను తగ్గించాయి. లీటర్‌ నూనెపై రూ.15 నుంచి రూ.20 వరకు తగ్గించినట్లు తెలిపాయి.సుంకాలు తగ్గించిన ప్రభుత్వం.. దిగుమతి సుంకాలను తగ్గించడం, నకిలీ నిల్వలను అరికట్టడం వంటి కఠినమైన చర్యల కారణంగా ప్రస్తుతం వంటనూనె ధరలు దిగి వస్తున్నాయి.దేశంలో వినియోగించే 56 నుంచి 60 శాతం వంటనూనెలను ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. గ్లోబల్‌గా ఉత్పత్తి తగ్గడంతో మన దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కస్టమర్లు మస్తు ఇబ్బందులు పడ్డాల్సి వచ్చింది.
ఇక పామాయిల్‌పై 7.5 శాతం, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 5 శాతం, ఆర్‌బీడీ పామోలిన్ ఆయిల్‌పై ఇటీవల 17.5శాతం నుండి 12.5%కి తగ్గించబడింది. ఇక శుద్ధి చేసిన సోయాబీన్, శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై సుంకం ప్రస్తుత 32.5 శాతం నుండి 17.5శాతంకు తగ్గించబడింది.

Related Posts