YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆనందయ్య... ఆనందం..ఆవిరి

ఆనందయ్య... ఆనందం..ఆవిరి

నెల్లూరు, జనవరి 13,
ఒక‌ప్పుడు అహా ఆనంద‌య్య‌.. ఓహో ఆనంద‌య్య అన్నారు. ఆయుష్ శాఖ అధికారులే ఆయ‌న మందు భేష్ అంటూ కితాబు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం నోటీసులు ఇస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే ఆనంద‌య్య మందును క‌నుమ‌రుగు చేసే కుట్ర చేస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఆనంద‌య్య‌పై వేధింపులు ఆపాల‌నే డిమాండ్లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే.... క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో మ్యాన్ ఆఫ్ ది ఏపీగా నిలిచారు ఆనంద‌య్య‌. వ‌న‌మూలిక‌ల‌తో మందు త‌యారు చేసి కొవిడ్ బాధితుల‌ను క్ష‌ణాల్లో కోలుకునేలా చేశారు. అంతే, ఆయ‌నుండే కృష్ణ‌ప‌ట్నానికి వేల సంఖ్య‌లో జ‌నం క్యూ క‌ట్టారు. ఆ వెంట‌నే అల్లోప‌తి మాఫియా కూడా రంగంలోకి దిగిన‌ట్టుంది. ఉన్న‌ట్టుండి ఆనంద‌య్య‌ను వారాల త‌ర‌బ‌డి ఏపీ పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. ర‌హ‌స్యంగా మందును త‌యారు చేయించి.. వైసీపీ ఎమ్మెల్యేలు త‌మ వారికి పంచుకున్నారు. ఆయుష్ శాఖ సైతం ప‌రిశోధ‌న‌లు చేసి.. అది ఆయుర్వేదం కాకున్నా.. ఆనంద‌య్య మందు ఓకే అంటూ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. కానీ, కొంత‌కాలానికి ఆనంద‌య్య పేరు మాయం. ఆయ‌న మందూ మాయం. లేటెస్ట్‌గా ఒమిక్రాన్ వేరియంట్ అటాక్ చేయ‌డంతో ఆనంద‌య్య మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌కు ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నారని సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. పైనుంచి ఆదేశాలు వ‌చ్చాయో ఏమో గానీ.. ఆయుష్‌ శాఖ ఈసారి సీరియ‌స్‌గా స్పందించింది. ఆనందయ్య మందుతో 48 గంటల్లో ఒమిక్రాన్‌ తగ్గిస్తామంటూ సోషల్‌ మీడియాతో ప్రచారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఒమిక్రాన్‌కు ఆనందయ్య మందు ఇస్తున్నట్టు తెలిసింది. మందుల తయారీకి ఆనందయ్య అనుమతి తీసుకోలేదు. ఆయుర్వేద మందులుగా ఆనందయ్య చెప్ప‌డం చట్టవిరుద్ధం. ఒమిక్రాన్‌ పేరిట మందు ఇవ్వకూడదని తెలిపాం. ఆనందయ్య ద‌గ్గ‌ర‌ శాస్త్రీయ ఆధారాలు ఉంటే ఇవ్వాలని అడిగాం. అందుకే నోటీసులు ఇచ్చాం’’ అని ఆయుష్‌ శాఖ తెలిపింది.  

Related Posts