YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కరోనా నిబంధనలకు దూరంగా జనాలు

కరోనా నిబంధనలకు దూరంగా జనాలు

శ్రీకాకుళం, జనవరి 13,
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వీరవిహారం చేస్తోంది. అందుకే నైట్ కర్ఫ్యూ విధించింది. సంక్రాంతి సందర్భంగా రిలాక్సేషన్ ఇచ్చింది. ఇదే ఒమిక్రాన్, కరోనా మహమ్మారికి కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ఏపీలోని శ్రీకాకుళంలో కరోనా బాధితులు లేని ఇల్లు లేదు . ఇబ్బంది పడని ఫ్యామిలీ కనిపించదంటారు. ఫస్ట్, సెకండ్ వేవ్ లో జనాల జీవితాలను ఛిద్రం చేసింది ఈ కోవిడ్‌ . అయినా ప్రజల తీరులో మార్పు రాలేదు. గతాన్ని మరచిన ప్రజలు, విచ్చలవిడిగా కోవిడ్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. కనీసం మాస్క్ కూడా ధరించకుండా షాపింగ్‌ లకు ఎగబడుతున్నారు. ఒమిక్రాన్ రూపంలో పెనుముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలను లైట్ తీసుకుంటున్నారు. ఆదివారం వస్తుందంటే చాలు షాపింగ్‌లంటూ షాపింగ్ మాల్స్, మార్కెట్లలో విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు.సంక్రాంతి పండగ వచ్చేసింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారితో శ్రీకాకుళంలో జనం కిటకిటలాడుతున్నారు. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా నడుస్తున్న ప్రజలతో, రోడ్లు రద్దీగా మారుతున్నాయి. కిక్కిరిసిన కోనుగోలు దారులతో షాపింగ్‌ మాల్స్‌ దర్శనం ఇస్తున్నాయి . అంతా బావుంది కానీ, కొవిడ్‌ నిబంధనలు మాత్రం గాలికి వదిలేస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి కంట్రోల్ కు మాస్క్‌ ఎంతగానో దోహదపడుతుందని నిఫుణులు చెబుతున్నారు. పది రూపాయల మాస్క్ తో ముక్కు, మూతి మూసుకోవడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారు పట్టణ జనం. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉందని, మాస్క్ తప్పనిసరి అని మొత్తుకుంటున్నారు వైద్య నిపుణులు.శ్రీకాకుళం జిల్లాలో తాజా గణాంకాలు ప్రకారం కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకూ 792 మంది వరకూ మరణించారు. ఫస్ట్ , సెకెండ్‌ వేవ్ లలో 12లక్షల 38 వేల కేసులు జిల్లాలో నమోదయ్యాయి. థర్డ్ వేవ్ ముప్పు ఏ విధంగా ఉంటుందో ఊహకు అందడం లేదు. కానీ, ఉపద్రవం ముంచుకు రాకముందే జాగ్రత్తలు అవసరం. ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న తరుణంలో కట్టడి చర్యలకు, ప్రభుత్వం మరోసారి ఉపక్రమించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలనే నిబంధనను విధించింది. మాస్క్‌ లేకుండా విచ్ఛలవిడిగా తిరిగే వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తుంది.పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తోంది. అయినా ప్రజలలో నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది..చాలామంది మాస్క్ లు పెట్టుకునేందుకు సుముఖత వ్యక్తం చేయటం లేదు . కనీసం సభలు, శుభకార్యాలు, షాపింగ్ మాల్స్ లో కూడా మాస్క్ ధరించడం లేదు. థర్డ్ వేవ్ తప్పదని.. ఎవరికి వారు మాస్క్ ధరించి స్వీయ రక్షణ పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Related Posts