కర్నూలు
శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవ నిర్వహించారు. ఆలయ ఉత్తరభాగంలో రావణ వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపారు. మాడవీధుల్లో స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవారిని ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు ఏర్పాటుచేసారు. వేకువజామునే శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజాదికాలు నిర్వహించారు. ఉదయం 3 గంటల నుండి ఆలయ ద్వారాలు తెరిచి మంగళవాయిద్యాలు అనంతరం 3 30 నిమిషాలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. మహా మంగళహారతి తర్వాత శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖ మండపంలో ఉత్తరముఖంగా వెన్ చెంబు చేయించి పూజాదికాలను జరిపించారు. ఈ పూజాదికాలు లో ముందుగా అర్చకస్వాములు వేదపండితులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పట్టించారు ఉత్సవంలో భాగంగా ఉత్సవమూర్తులను స్వామి వారి ఆలయ ముఖమండపం ఉత్తర ద్వారం నుండి వెలుపలకు తోడ్కొని వచ్చి రావణ వాహనంపై ఆశీనులను చేసి ఆలయ ఉత్సవాన్ని జరిపించారు .భక్తులకు శ్రీ స్వామివారి అమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు వీలుగా ఉత్సవమూర్తులను ఆలయ ముఖమండపం ఉత్తరం వైపున బలిపీఠం సమీపంలో వెన్ చెంబు చేయించారు.