ఖమ్మం, జనవరి 13,
ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె తమ్ముడి భార్యను పంపించమన్నాడు. ఆ మాట తట్టుకోలేక.. భార్యాపిల్లలతో సహా తగలబెట్టేసుకున్నాడు నాగా రామకృష్ణ. ఆ ఆగ్రహజ్వాలలో.. అతని అరాచక చరిత్ర ఆహుతి అయింది. వాడి పాపాలు పండాయి. దశాబ్దాలుగా చేస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలు, రాసలీలలకు ఎండ్‌కార్డ్ పడింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ అరెస్టుతో అతని అక్రమాల నుంచి విముక్తి లభించినట్టైందని అంటున్నారు జిల్లా ప్రజలు. భూదందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులే కాదు.. వనమా రాఘవేంద్రరావు రాసలీలలూ ఎక్కువే అంటున్నారు. 1992లో స్థానిక ఎస్‌ఐ భార్యను రాఘవేంద్రుడు లొంగదీసుకున్నాడట.. ఆ విషయం తెలిసి అతన్ని అడ్డుకోడానికి ఆ ఎస్ఐ తీవ్రంగా ట్రై చేశాడని.. కానీ, రాఘవ పవర్ ముందు ఆ ఎస్ఐ పోలీస్ పవర్ సరిపోలేదని.. దీంతో ఆ ఎస్ఐ తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని స్థానికంగా చెబుతుంటారు. ఇక, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నాగా రామకృష్ణ అక్కతో రాఘవేంద్రరావుకు 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉందని అక్కడి వారందిరికీ తెలిసిందే. ఆమెకు ఫేవర్ చేసేందుకే.. రామకృష్ణను వేధించేందుకు అతని భార్యను పంపాలని బెదిరింపులకు దిగాడు. అది భరించలేక రామకృష్ణ కుటుంబంతో సహా సూసైడ్ చేసుకున్నాడు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ మహిళా నేతతో కూడా.. వనమా రాఘవకి ఇల్లీగల్ కనెక్షన్ ఉందని అంటారు. వాళ్ల వీడియోలు సైతం.. బహిర్గతం అయ్యాయని.. వాటిని తన అధికార బలంతో బయటకు రాకుండా చేశారని చెబుతారు. అందుకోసం పెద్ద మొత్తమే చెల్లించుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి