హైదరాబాద్, జనవరి 13,
ఆ పార్టీలో పదవులు రాకుంటే పెద్దస్థాయిలో పంచాయితీ జరుగుతుంది. తీరా పదవులు ఇస్తే పని చేయడం లేదట. తాపీగా రిలాక్స్ అవుతున్నారట. వర్క్ లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిన నాయకులు ఎవరు?తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు.. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డితోపాటు ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ను నియమించారు. మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మహేశ్‌గౌడ్, అజారుద్దీన్.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌లు ఆ పదవుల్లో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు పెంచాలని.. వర్కింగ్ ప్రెసిడెంట్స్‌కి పని విభజన చేశారు. జనంలోకి వెళ్లేందుకు వీలుగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు కూడా. అయితే.. వర్కింగ్ ప్రెసిడెంట్స్‌కు అప్పగించిన బాధ్యతలు అమలులోకి వచ్చినట్టు కనిపించడం లేదు. ఆ అంశంపై పీసీసీ సమీక్షలూ లేవు. వర్కింగ్ ప్రెసిడెంట్స్ పరిస్థితి.. నో వర్క్.. నో మూడ్ అన్నట్టు ఉందట.వర్కింగ్ ప్రెసిడెంట్స్‌లలో మాజీ మంత్రి గీతారెడ్డి సీనియర్. నల్లగొండ.. సికింద్రాబాద్.. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలతోపాటు, మరికొన్ని పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించారు. ఇటీవల సభ్యత్వ నమోదుపై తప్పితే.. పార్టీ యాక్షన్ ప్లాన్ అమలుపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇంటర్ ఫలితాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆందోళనలు చేశారు తప్పితే మిగతావాళ్ల నుంచి చప్పుడు లేదు. ఇంఛార్జ్‌లుగా ఉన్న చోటుకు వెళ్లి ఉదంతాలు లేవంటున్నాయి పార్టీ వర్గాలు.అంజన్ కుమార్ యాదవ్ నిజామాబాద్, మహబూబాబాద్, మెదక్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జ్. యువజన కాంగ్రెస్ పర్యవేక్షకుడిగానూ ఉన్నారు. అంజన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించిన కొన్ని రోజులకే కరోనా రావడంతో ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ఇంత వరకు పనిలోకి దిగలేదు. అంజన్ దగ్గరే కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌కు రాజకీయాలకంటే క్రికెట్ పనులే ఎక్కువ.అడపా దడపా పార్టీ సమావేశాలకు రావడం తప్పితే.. పెద్దగా కాంగ్రెస్‌కు టైం ఇస్తున్నది లేదు. ఇదే అజారుద్దీన్ ఆదిలాబాద్, జహీరాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జ్ కూడా. పార్టీ 30 లక్షల సభ్యత్వం నమోదును లక్ష్యంగా పెట్టుకుంటే.. ఒక్కసారి సమీక్ష చేయలేదు. జహీరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ పెట్టి నేనున్నా అని అనిపించారు. ఆ టోర్నీ గురించి గీతారెడ్డికి చెప్పకపోవడంతో అది కాంగ్రెస్‌లో మరో పంచాయితీకి దారితీసింది. ప్రియాంకా గాంధీ కోటాలో పదవి వచ్చింది అనే టాక్ తప్పితే.. అజారుద్దీన్‌తో ఒరిగిందేమీ లేదన్నది గాంధీభవన్ వర్గాల వాదనవర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జగ్గారెడ్డి ఖమ్మం, వరంగల్, భువనగిరి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జ్. ఆయన కూడా ఆయా నియోజకవర్గాల్లో అడుగు పెట్టింది లేదు. ఖమ్మంలో మిర్చి రైతులు.. వనమా రాఘవ ఎపిసోడ్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక్కరే గ్రౌండ్‌లోకి వెళ్లారు. మహిళా కాంగ్రెస్‌కు ఇంఛార్జ్‌గా ఉన్నా పట్టించుకోలేదట. జగ్గారెడ్డి పరిధిలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలు అన్నీ కీలకమే. అయితే అక్కడ నాయకులు వివాదాస్పదమని భావించారో ఏమో.. సొంత అజెండా భుజాన వేసుకున్నారుమరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్.. ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు దగ్గరి మనిషిగా ప్రచారం ఉంది. పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చేతుల మీదుగానే సాగుతున్నాయి. అయితే పార్టీలో అంతర్గత పంచాయితీలు అన్నింటికీ మహేష్‌గౌడ్ సంధానకర్త కావడంతో.. పని తక్కువ పంచాయితీలు ఎక్కవ అనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తనకు అప్పగించిన మహబూబ్‌నగర్, చేవెళ్ల, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమీక్షలకు వెళ్తున్నా.. రేవంత్, పార్టీ సీనియర్ల మధ్య సయోధ్యకే ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారట మహేష్‌గౌడ్. మొత్తానికి వర్కింగ్ ప్రెసిడెంట్లకు అసలు వర్క లేకుండా పోయింది. అంతా రెస్ట్ మూడ్‌లో ఉండిపోయారు. మరి.. పార్టీకి కీలకమైన ఈ సమయంలో రిలాక్స్ మూడ్ నుంచి ఎప్పుడు బయటపడతారో ఏమో..?