YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ఇద్దరిని చంపేసిన వాట్సప్ మెసేజ్

ఇద్దరిని చంపేసిన వాట్సప్ మెసేజ్

వాట్సాప్‌లో ఎన్నో చెత్త మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. అలాంటిదే ఒకటి తమిళనాడులో ఇద్దరి ప్రాణాలు తీశాయి. బయటి నుంచి వచ్చే వ్యక్తులపై కన్నేసి ఉంచాలని, వాళ్లు పిల్లలను కిడ్నాప్ చేయడానికి వస్తున్నారన్నది ఆ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ ఆ ప్రాంతంలో వైరల్‌గా మారింది. దీంతో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులను స్థానికులు హత్య చేశారు. పులికాట్‌లో ఓ వ్యక్తిని పిల్లల కిడ్నాపర్‌గా పొరపడి కొందరు వ్యక్తులు దాడి చేసి చంపేశారు. బ్రిడ్జి నుంచి కిందకు వేలాడదీసి హత్య చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ గ్రూపులోని 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఉత్తర భారతదేశం నుంచి వచ్చి పిల్లలను కిడ్నాప్ చేస్తున్నాడని భావించే ఈ హత్య చేసినట్లు వాళ్లు చెప్పారు. అదే రోజు 63 ఏళ్ల రుక్మిణి అనే మరో మహిళను కూడా ఇలాగే కొట్టి చంపారు. ఈ ఘటన తిరువన్నమైలై జిల్లాలో జరిగింది. ఆ మహిళ బంధువులైన నలుగురు కూడా ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇంటి దేవుడిని దర్శించుకొని బంధువులతో కలిసి రుక్మిణి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దర్శనం తర్వాత ఓ ఊళ్లో కారు ఆపి అక్కడి పిల్లలకు చాక్లెట్లు పంచింది. ఆమె పిల్లలను కిడ్నాప్ చేయడానికే అలా చేస్తుందని భావించిన స్థానికులు ఆమెపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆమె మరణించింది. ఆమె చెప్పేది కూడా వినకుండా వాళ్లు దారుణంగా దాడి చేశారని రుక్మిణి బంధువులు చెప్పారు. ఈ గ్రామంలోని 30 మందిని పోలీసులు అరెస్ట్ చేసి హత్య కేసు పెట్టారు. ఈ వాట్సాప్ మెసేజ్ వల్ల మరికొందరు బయటి వ్యక్తులు కూడా దాడికి గురయ్యారు. ఇలాంటి తప్పుడు వాట్సాప్ మెసేజ్‌లను నమ్మొద్దని వెల్లూరు ఎస్పీ పగలవన్ ప్రజలకు చెప్పారు.

Related Posts