బెంగళూరు, జనవరి 13:
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కొత్త చైర్మన్‌గా సీనియర్ శాస్త్రవేత్త, రాకెట్ ఇం జనీరింగ్ నిపుణుడు ఎస్ సోమనాథ్ నియమితులయ్యారు. ప్ర స్తుతం ఇస్రో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె శివన్ పదవీకాలం 14తో ముగియనుంది. ఆయన తర్వాత ఇస్రోకి పదో చైర్మన్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్(డీవోఎస్) కార్యదర్శిగా సోమనాథ్‌ను నియమిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆయన మూ డేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. సోమనాథ్ 2018 జనవరి 22 నుంచి విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు ఆయన రెండున్నరేళ్లపాటు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేశారు.‘ఈ ముఖ్యమైన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేస్తాను’ అని సోమనాథ్ చెప్పారు. కేరళలోని టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (కొల్లాం)లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేసిన సోమనాథ్.. ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎ్‌ససీ) నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ గోల్డ్ మెడల్ సాధించారు. రాకెట్ ఇంజనీరింగ్, లాం చింగ్ వెహికిల్స్ డిజైనింగ్‌లో నిపుణుడిగా పేరొందారు.