YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా ఆంధ్ర ప్రదేశ్

అందరివాడా... కొందరి వాడా...

అందరివాడా... కొందరి వాడా...

విజయవాడ, జనవరి 14,
చాలారోజులుగా నానుతోన్న ఓ వివాదానికి, ఓ సమస్యకు తెరపడబోతోందా? అందరివాడుగా పేరుగాంచిన చిరంజీవి రంగంలోకి దిగడంతో ఏపీలో రచ్చగా మారిన సినిమా టిక్కెట్ ధరల వివాదం సమసిపోతుందన్న కామెంట్లు మొదలయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఆహ్వానించడంతో ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి సీఎంతో గంటన్నరపాటు గడిపారు. లంచ్ కమ్ మీట్‌గా సాగిన భేటీ తర్వాత చిరంజీవి చెప్పిన మాటలు ఇండస్ట్రీ వర్గాలకే కాదు.. సినీ ప్రేక్షకుల్లో ఆనందం కలిగించాయనే చెప్పాలి. ఇదివరకు జారీ చేసిన జీవోను సవరించి.. త్వరలోనే మరో జీవో వస్తుందన్న సంకేతాల్నించ్చారాయన. అయితే.. కొత్త జీవో ముసాయిదా సిద్దం కాగానే మరోసారి కలుద్దామని సీఎం చెప్పారంటూ చిరంజీవి చేసిన ప్రకటన ఈ సమస్య పరిష్కారంలో ముఖ్యమంత్రి సినీ పెద్దల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోబోతున్నారనిపించేలా చేసింది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న వివాదానికి తెర దించేందుకు ఎట్టకేలకు చిరంజీవి రంగంలోకి దిగారు. సినిమా పెద్దగా కాదు.. సినిమా బిడ్డగా అంటూ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు సీఎం జగన్‌ భేటీతో ఇటు టికెట్‌ ధరలు, అటు థియేటర్ల మూసివేతపై ఓ క్లారిటీ తీసుకొచ్చేందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీసు మెట్లెక్కారు. సీఎంతో దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపారు. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో నెలకొన్న వివాదం అందరికీ తెలిసిందే. ఆన్‌లైన్‌ టికెటింగ్ అంటూ మొదలైన ఇష్యూ ఆ తర్వాత ఎన్ని మలుపులు తిరగాలో అన్ని మలుపులు తిరిగింది. ఎక్కడో మొదలైన గొడవ.. ఇంకెక్కడికో వెళ్లిపోయింది. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ఈ ఇన్సిడెంట్స్‌ అన్నింటి నేపథ్యంలో జరుగుతున్న చిరంజీవి-జగన్ మీటింగ్‌పై సహజంగానే అటు ఇండస్ట్రీ, ఇటు పొలిటికల్ వర్గాల్లోనూ ఆసక్తి ఏర్పడేలా చేసింది. టిక్కెటింగ్ వ్యవహారం కాస్తా.. కుల పంచాయితీల దాకా వెళ్ళిన నేపథ్యంలో మరింత రచ్చ జరగ కూడదని అందరు భావించారు. ఈనేపథ్యమే ఈ భేటీ ప్రాధాన్యతను పెరిగేలా చేసింది.సీఎం ఆహ్వానం మేరకు.. ఇండస్ట్రీ బిడ్డగా విజయవాడ వచ్చానని చెప్పారు చిరంజీవి. బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి స్పెషల్‌ ఫ్లైట్‌లో బయల్దేరిన చిరంజీవి… గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీఎం జగన్‌ ఇంటికి వెళ్లారు. సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది. మరి ఈ మీటింగ్‌తో గత 2 నెలలుగా ఫిల్మ్‌ఇండస్ట్రీలో నెలకొన్న వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందా? అన్ని సమస్యలకు ఓ సొల్యూషన్ లభిస్తుందా అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక ఈ మధ్య చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ గురించి కూడా చెప్పుకోవాలి. ఇండస్ట్రీకి తాను పెద్దమనిషిగా ఉండనని..అలా పిలుపించుకోవడం కూడా తనకు ఇష్టముండదని స్పష్టంగా చెప్పారు చిరంజీవి. అయితే సమస్య వస్తే మాత్రం ముందుంటానని చెప్పారు. ఇప్పుడు జగన్‌తో మీటింగ్‌కు కూడా ఇన్షియేటివ్‌ తీసుకున్నారు. అంటే వద్దు..వద్దు అంటూనే పెద్దమనిషిపాత్ర పోషిస్తున్నారు చిరంజీవి. ఇక ఈ మెగా మీటింగ్‌లోని పొలిటికల్ యాంగిల్‌ను ఓసారి చూద్దాం. చిరంజీవిని కేవలం ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగానే చూడాలా? లేక ఈ భేటీకి పొలిటికల్ ఇంపార్టెన్స్ కూడా ఉందా అన్న టాక్ కూడా‌ జోరుగా సాగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నా చిరంజీవి ఓ రాజకీయనాయకుడు. ఓ పార్టీని స్థాపించారు. ఏకంగా 18 ఎమ్మెల్యే స్థానాలు గెలిచారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ప్రస్తుతం పాలిటిక్స్‌కు కాస్త దూరంగా ఉంటున్నారు.ఇప్పటికీ సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ చిరంజీవి మోస్ట్‌ పాపులర్ ఫిగర్. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన ఓ వర్గానికి పెద్దదిక్కు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పొలిటికల్ సీన్‌ నేపథ్యంలో చిరంజీవి-జగన్‌ మీటింగ్‌కు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. అందుకే ఈ మెగా మీటింగ్‌పై అటు ఇండస్ట్రీ, ఇటు పొలిటికల్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. సీఎం జగన్ ఆహ్వానం మేరకు.. ఇండస్ట్రీ బిడ్డగా విజయవాడ వచ్చానని చెప్పారు చిరంజీవి. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై నాగార్జున స్పందించారు. తన సినిమా విడుదల ఉండటం వల్ల చిరంజీవితో కలిసి వెళ్లలేకపోయాయని అన్నారు. మా అందరి కోసం సీఎంతో చిరంజీవి సమావేశమయ్యారని అన్నారు. అయితే ఒకే ఒక్క జీవోతో కొద్ది రోజులుగా ఏపీ సర్కార్‌ వర్సెస్‌ టాలీవుడ్ మధ్య కోల్డ్‌ వార్‌ మొదలైంది. టికెట్‌ ఫైట్‌పై మొదలైన రగడ మలుపులు మలుపులు తిరుగుతూ ఎక్కడికో వెళ్లింది. జీవో నెం.35.. టాలీవుడ్‌ వర్సెస్‌ ఏపీ సర్కార్‌ మధ్య కోల్డ్‌వార్ షురూ అయ్యేలా చేసింది. సినిమా టికెట్‌ ధరల్ని నియంత్రిస్తూ జారీ చేసిన జీవోపై ఇండస్ట్రీ నుంచి కొంతమంది ఆచితూచి స్పందించారు. కానీ హీరో నాని మాత్రం కాస్త ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. అక్కడినుంచి మొదలైంది అసలు కథ.టికెట్‌ ధర కాస్త కిరాణా కొట్టువైపు టర్న్‌ అయింది. నాని కామెంట్లపై మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని సూటిగా సుత్తి లేకుండానే కౌంటర్‌ ఇచ్చారు. టికెట్‌ ధరలు, కిరాణా కొట్టు వ్యాఖ్యలు అగ్గిరాజేస్తుండగానే సడెన్‌గా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మరో మంత్రి బొత్స సత్యనారాయణ. సామాన్యుడికి వినోదం అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ ఉద్దేశమని కుండబద్దలుకొట్టారు. టికెట్‌ ధరల నుంచి విషయం ఎమ్మార్పీ వైపు మళ్లింది. అది అక్కడితో ఆగలేదు. హీరోల రెమ్యూనరేషన్‌ దాకా వెళ్లింది. పవన్‌ను సీన్‌లోకి లాగిన మంత్రి అనిల్‌ కుమార్‌ ఆయన తీసే సినిమా ఖర్చెంత.. తీసుకునే పారితోషికం ఎంత అని ప్రశ్నించారు. టికెట్‌ ఫైట్‌లో లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన నిర్మాత నట్టికుమార్‌.. ప్రభుత్వం, సన్మానం అంటూ చేసిన వ్యాఖ్యలు.. వివాదాన్ని మరో స్టేజ్‌కి తీసుకెళ్లాయి. ఇష్యూతో సంబంధం లేని పాత్రలు ఎంట్రీ ఇచ్చి మ్యాటర్‌ని ఎక్కడికో తీసుకెళ్లారు. ఏపీ సర్కార్‌, టాలీవుడ్‌ మధ్య కోల్డ్‌వార్‌ను చల్లార్చేందుకు మెగాస్టార్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదానికి పుల్‌స్టాప్‌ పడబోతోందని సీఎం జగన్‌తో భేటీ తర్వాత చిరంజీవి చెప్పారు. అతి త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన జీవో రాబోతోంది. ఇదీ… సీఎం జగన్‌తో భేటీ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన భరోసా. చిన్న సినిమాల కష్టాలపైనా సీఎం జగన్‌తో చర్చించానన్నారు చిరంజీవి. ఎక్స్‌ట్రా షో గురించి ఆయనకు విన్నవించాననీ… దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారనీ చెప్పారు.సినిమా సమస్యలపై వివరించేందుకు సీఎం జగన్‌ను.. అవసరమైతే మళ్లీ కలుస్తానన్నారు చిరంజీవి. అవసరమైతే.. మరోసారి లంచ్‌ టైమ్‌లోనే కలవాలని సీఎం చెప్పారని.. చిరంజీవి తెలిపారు. ఆయన ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు. తాను చెప్పిన విషయాలన్నీ.. కమిటీకి వివరిస్తానని సీఎం చెప్పినట్టు చిరంజీవి తెలిపారు. ఆ తర్వాత కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆలోపు సినిమాలోని అన్ని వర్గాల వారితో చర్చిస్తానని చెప్పారు చిరంజీవి. మొత్తమ్మీద చిరంజీవి-జగన్ భేటీ సినీ వర్గాల్లో నెలకొన్ని సందిగ్ధ పరిస్థితికి తెర వేస్తుందన్న విశ్వాసం అందరిలో వ్యక్తమవుతోంది.

Related Posts