YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మార్పు మంచిదే అంటున్న తమ్ముళ్లు

మార్పు మంచిదే అంటున్న తమ్ముళ్లు

తిరుపతి, జనవరి 14,
టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం పర్యటన కొత్త కాకపోయినా.. పార్టీ కేడర్‌కు మాత్రం ఈసారి చంద్రబాబు టూర్‌లో స్పెషల్‌ ఉందని చెవులు కొరుక్కుంటున్నాయి. అధినేతలో మార్పు వచ్చిందని ఓపెన్‌గానే సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ్ముళ్లు.పంచాయతీ.. జడ్పీటీసీ.. ఎంపీటీసీ.. మున్సిపల్ ఎన్నికలలో వరస ఓటముల తర్వాత చంద్రబాబు రావడంతో.. ఆయన ఎలా స్పందిస్తారా అని టీడీపీ కేడర్‌ ఆసక్తిగా ఎదురు చూసింది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని లైట్‌ తీసుకున్నవాళ్లకు మాత్రం అంచనాలు తప్పాయి. కొత్త రూట్‌లో వెళ్లడం మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి సహా పార్టీ నేతలకు కేడర్‌కు షాక్‌ ఇచ్చినట్టు సమాచారం. ఎప్పటిలాగే ఓటమికి మీదే బాధ్యత అనిచెప్పిన చంద్రబాబు రెండు అంశాలపై ఆవేదన వ్యక్తం చేశారు. అవి.. ఒకటి మొన్నటి ఎన్నికల ఫలితాలు. రెండోది కుప్పంలో డబ్బులు పంచడం. కుప్పంలో ఓటమి అని తనను ఎగతాళి స్తే.. మిమ్మల్ని అన్నట్టు కాదా అని ఎదురు ప్రశ్నించారు బాబు.కుప్పం జనం కూడా ప్రలోభాలకు లొంగిపోతే ఎలా అని మరో ప్రశ్న సంధించారు చంద్రబాబు. ఇకపై బాగా పనిచేయాలని.. కుప్పంలో కోవర్టులు పంపేసి.. పార్టీని ప్రక్షాళన చేస్తానని ఆయన తెలిపారు. ముఖ్యంగా పార్టీ కేడర్‌కు ఎప్పటి నుంచో తలనొప్పిగా మారిన PA మనోహర్‌, గౌరివాణి శ్రీనివాసులు, మునిరత్నంలను పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో చేద్దాం.. చూద్దాం అని నాన్చిన చంద్రబాబు.. ఈసారి మాత్రం వారితోపాటు మరో ముగ్గురిని.. కొందరు కోవర్టులను ఇంటికి పంపుతానని చెప్పడంతో కేడర్‌ షాక్‌ తిందట. వరస ఓటములు చంద్రబాబును ఇంతిలా మారుస్తాయని అనుకోలేదని చెబుతున్నారు టీడీపీ తమ్ముళ్లు.కేడర్‌ డిమాండ్స్‌పైనే కాకుండా ఎప్పటి నుంచో తనపై వస్తున్న విమర్శలకు బాబు చెక్‌ చెప్పారు. కుప్పంలో చంద్రబాబుకు ఇల్లు లేదని వైసీపీ చేసే కామెంట్స్‌కు సమాధానం ఇచ్చారు. టీడీపీ ఆఫీస్‌ ఎదురుగానే ఇంటి స్థలం కోసం పరిశీలించి.. దీపావళి కల్లా నిర్మాణం పూర్తి చేయాలని లోకల్‌ లీడర్లకు చెప్పారట. వచ్చే ఎన్నికల్లో బాబును కుప్పంలో ఓడిస్తామన్న వైసీపీ ప్రకటనకు జవాబిచ్చారు చంద్రబాబు. తాను నియోజకవర్గం మార్చాలా.. ఆ అవసరం ఉందా అని పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. తాను కుప్పానికి ముద్దు బిడ్డనని.. కుప్పం వదిలి ఎక్కడికీ పోనని క్లారిటీ ఇచ్చారు.చంద్రబాబు ఎప్పుడు కుప్పం వచ్చినా.. ఆయన పర్యటనలో తెగ హడావిడి చేసే పీఏ మనోహర్‌, గౌరివాణి శ్రీనివాసులు.. ఈ దఫా బాబు పర్యటనలో ఎక్కడా కనిపించలేదు. వారిని ఆ సమీపంలోకి రావొద్దని సూచించినట్టు సమాచారం. వీరి స్థానంలో కుప్పానికి తాత్కాలిక ఇంఛార్జ్‌గా మాజీ మంత్రి అమర్నాథరెడ్డిని నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌తో వన్‌సైడ్‌ లవ్‌.. కుప్పంలో ఇప్పటి వరకు పర్యటించని గ్రామాలకు వెళ్లడం.. అందరితో ఫొటోలు దిగడం.. కేడర్‌ను ఆశ్చర్యపరిచిందట. దీంతో చంద్రబాబుకు తనదాకా వస్తే కానీ.. తెలిసిరాలేదని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి.. మార్పు టీడీపీ అధినేతకు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.

Related Posts