YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆప్ కు పెరుగుతున్న బలం...

 ఆప్ కు పెరుగుతున్న బలం...

ఛండీఘడ్, జనవరి 14,
పంజాబ్  శాసన సభ ఎన్నికలలో ప్రధాన పోటీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్యనే ఉంటుంది. బీజేపీ, అకాలీదళ్, అలాగే మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత పార్టీ, ఇతర చిన్నా చితక పార్టీలు అన్నీ  ఆటలో అరటి పండులా మిగిలి పోవడమీ కానీ, పెద్దగా ప్రభావం చూపే ఆకాశం  లేదు. ఈ విషయంలో  ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు.. అయితే, కాంగ్రెస్, ఆప్ పార్టీలలో ఎవరిదీ పై చేయి అంటే, కాంగ్రస్ పార్టీకి ఉన్న సుదీర్ఘ చరిత్ర, పరిపాలనా అనుభవం దృష్ట్యా నిస్సందేహంగా  కాంగ్రెస్ పార్టీదే పై చేయి,   కావాలి, కానీ,  అంతర్గత కుమ్ములాటలతో పార్టీ కుదేలైపోయింది. పార్టీ ముఖ్య నేతల మధ్య  కలహాలు ఆ పార్టీ విజయావకాశాలను గట్టిగా దెబ్బ తీస్తున్నాయని పరిశీలకు  భావిస్తున్నారు, నిజానికి కెప్టెన్ అమరీందర్ సింగ్ 'ను కాదని నవజ్యోతి సింగ్ సిద్దూకు పార్టీలో  ప్రాధాన్యత ఇవ్వడంలోనే కాంగ్రెస్ పార్టీ తప్పులో కాలేసింది. .ఇప్పుడు ఆ తప్పు  దిద్దుకోలేని  స్థితికి చేరిందని పంజాబ్ రాజకీయాలను దగ్గరగా చూస్తున్న పరిశీలకులు పేర్కొంటున్నారు. అదలా  ఉంటే,    ఆలూ లేదు చూలు లేదు .. కొడుకు పేరో ఏదో   అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ లో,  'కౌన్ బనేగా ముఖ్యమంత్రి' పేరిట కొత్త వివాదం సాగుతోంది. కొద్ది రోజుల్లో ఫిబ్రవరి 14న  జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ , ఇటు  పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. సహజంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రుల ఎంపిక ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియని విషయం  కాదు. అఫ్కోర్స్ ఇప్పుడు బీజేపీలోనూ అదే  జరుగుతోందనుకోండి , అయినా  సీల్ల్డ్  కవర్ కల్చర్ అంటే ముందుగా కాంగ్రెస్ పార్టీనే గుర్తుకు వస్తుంది. ముఖ్యమంత్రులను నియమించాహదం అయినా తీసేయడం అయినా అంట అధిష్ఠానం అభీష్టం మేరకు జరుగుతుందే కై, ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువ ఉండదు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అదే పరిస్థితి. పంజాబ్ విషయానికి వస్తే, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు రెండు 'ముఖ్య' ముఖాలు ఉన్నాయి. ఒకరు ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కాగా, మరొకరు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఈ ఇద్దరు నేతలు తాజాగా వెల్లడించిన అంశాలను చూస్తుంటే  ఇది కూడా చిలికి చిలికి గాలివానగా మారి, కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలని మరింతగా దెబ్బతీసేలా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఒకరు హైకమాండ్ నిర్ణయం అంటుంటే మరొకరు ప్రజలు నిర్ణయిస్తారని అంటున్నారు. మరొక నేత అయితే అసలు అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు. ఈ అందరి అభిప్రాయం ఆలోచనలు  ఏలా  ఉన్నా, కాంగ్రెస్ అధినాయకత్వం ఏరి కోరి ఇచ్చి నెత్తిన పెట్టుకున్న పీసీసీ చీఫ్ నవజ్యోతి  సింగ్ సిద్దూ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయని అంటున్నారు.  "ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనప్పుడు పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ 2017లో అభ్యర్థిని ప్రకటించి విజయం సాధించింది. ఈసారి కూడా అభ్యర్థిని ప్రకటిస్తారు. కాకపోతే ఆ అభ్యర్థి ఎవరని హైకమాండ్ నిర్ణయిస్తుంది " అని  ముఖ్యమంత్రి  చన్నీ అంటే,  హై కమాండ్ ఎవరు .అంటూ  సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు . ముఖ్యమంత్రిని హై కమాండ్ కాదు,  ప్రజలు నిర్ణయిస్తారు. హైకమాండ్ సీఎంను నిర్ణయిస్తుందని మీకు ఎవరు చెప్పారు?’అని విలేకరులను ఎదురు ప్రశ్నించారు.ఇక ఇదే అంశంపై సునిల్ జాఖర్ స్పందిస్తూ ‘‘ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించరు. జాయింట్ లీడర్‌షిప్‌లోనే పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది’’ అని సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై సీఎం చన్నీ ఒకలా పీసీసీ చీఫ్ సిద్ధమూ మరొకలా పార్టీ నేతలు ఇంకోలా స్పందిస్తున్నారు. దీంతో అసలు కాంగ్రెస్ పార్టీ తరపు సీఎం అభ్యర్థి ఎవరనేది పార్టీలోని నేతలే తేల్చుకోలేకపోతున్నారు. ఇలా నాయకుల మధ్య ప్రతి విషయంలోనూ ఎడ్డెమంటే తెడ్డెమనే ధోరణి కొనసాగీతే, ప్రజలు అసహ్యించుకుఅంటారని పరిశీలకులు అంటున్నారు. నిజానికి పంజాబ్ ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) లోనూ ముఖ్యమంత్రి ఎవరన్న మీమాంస ఉంది. ముఖ్యమంత్రి పేరు ప్రకటించకుండా బరిలో  దిగితే ఓటమి తప్పదనే సెంటిమెంట్ పంజాబ్ ఆవ్  నేతలు కూడా వ్యక్త పరుస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఆప్  అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వ్యూహాత్మకంగా  అడుగులు వేస్తున్నారు.  సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్'అయితే బాగుంటుందని భావిస్తున్నానని, కేజ్రీవాల్ తెలిపారు. అయితే ప్రజలే దీనిని నిర్ణయించాలని, నిర్ణయాన్ని ప్రజల కోర్టు లోకి  నెట్టశా రు నిజంగానే ఆప్  తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి కాంగ్రెస్ ప్రకటించేలేని పరిస్థితి వస్తే, అది కాంగ్రెస్ పార్టీకి  మరో  మైనస్ పాయింట్ అవుతుందని అంటున్నారు. ఏఁమైనా కాంగ్రెస్ స్వయం కృతంతో ఢిల్లీకే  పరిమితం అనుకున్న ఆప్ పంజాబ్ లోనూ జెండా ఎగరేస్తుందని పరిశీలకులు అంటున్నారు. అలాగే, పంజాబ్ తో పాటు గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్న ఆప్, పంజాబ్ లో గెలిచి గోవా లోకాలుమోపితే,  జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యాన్మాయంగా ఒక ప్రత్యాన్మాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, చివరకు ఏమి జరుగుతుంది అనేది . మా ర్చి 10 న తేలిపోతుంది.

Related Posts