YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాపు కాసేందుకే చిరంజీవా...

కాపు కాసేందుకే చిరంజీవా...

విజయవాడ, జనవరి 16,
జగన్ తో చిరంజీవి భేటీ తర్వాత సినిమా పరమైన సమస్యల సంగతి ఏంటో కాని రాజకీయ పరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ భేటీలో చిరంజీవికి రాజ్యసభ పదవిని జగన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి రాజ్యసభ వైసీపీ తరుపున ఇస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మానసికంగా దెబ్బతీసేందుకు అవకాశం దొరుకుతుంది. అలాగే కాపు సామాజికవర్గం ఓట్లు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ వైపు మొగ్గు చూపుతాయన్న ఆలోచనతోనే చిరంజీవికి జగన్ రాజ్యసభ ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. నాలుగు స్థానాలు... వచ్చే జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలన్నీ వైసీపీకే దక్కనున్నాయి. ఇందులో విజయసాయిరెడ్డి కి మరోసారి జగన్ రెన్యువల్ ను ఖచ్చితంగా చేస్తారు. మిగిలిన మూడు స్థానాల్లో కాపు సామాజికవర్గానికి ఇవ్వాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి బీసీ, ఒకటి ఎస్సీ సామాజికవర్గానికి కేటాయించాలన్నది జగన్ డిసైడ్ అయ్యారంటున్నారు. ఒకటి చిరంజీవికి రాజ్యసభ స్థానాన్ని ఇస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందని జగన్ తన నిర్ణయాన్ని చిరంజీవి ముందు ఉంచారంటున్నారు. అయితే చిరంజీవి నుంచి ఎటువంటి స్పందన వచ్చిందనేది తెలియదు. వైసీపీ నుంచి మాత్రం రాజ్యసభ సీటు మెగాస్టార్ కు ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారు. . కానీ చిరంజీవి మాత్రం రాజకీయాల పట్ల సుముఖంగా ఉండే ఛాన్స్ లేదు. ఒకవైపు సోదరుడు జనసేన పార్టీతో వచ్చే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆయన ప్రత్యర్థి పార్టీతో చేతులు కలిపేందుకు చిరంజీవి ఇష్టత చూపే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన రాజకీయాలపై విరక్తి చెందిన తర్వాతనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ యాక్టివ్ గా లేరు. అలాంటి చిరంజీవి జగన్ ఆఫర్ ను ఓకే చెబుతారనుకోవడం కల్లే. కానీ వైసీపీ లీకులిచ్చినట్లు ఒకవర్గం మీడియా ప్రచారం కేవలం చిత్ర పరిశ్రమ సమస్యను పక్కదోవపట్టించడానికేనన్నది అర్థమవుతుంది.

Related Posts