కర్నూలు, జనవరి 16,
మాటలు కోటలు దాటడం అనే మాట విన్నాం కదా. కానీ వైసీపీ విషయంలో మాత్రం.. మాటలు కోటలు కాదు.. కోట్లకి కోట్లు దాటుతాయి. కానీ.. అమలు విషయంలో మాత్రం పట్టింపే ఉండదు. ఎన్ని కష్టాలు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకుంటుంది అనే ఆశ పెట్టుకోవడం అంతా అమాయకత్వమే అనిపిస్తుంది ఏపీ ప్రజలకి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా అర్దం అవుతోంది.కర్నూలు అంటే టమాట.. టమాట పంట అంటే కర్నూలు అన్నట్లుగా ఉంటుంది. ఎంత నష్టం వచ్చినా.. ప్రతి ఒక్కరికీ మంచి టమాట అందించాలని అక్కడి రైతులు అంతా టమాట పంట ఫుల్లుగా పండిస్తారు. కానీ.. వారికి ఎప్పుడూ రేటు మాత్రం గిట్ట బాటు కాదు. పెట్టుబడులు, కూలీ ఖర్చులు అనే విషయాన్ని వదిలేస్తే.. కనీసం మార్కెట్ కి తీసుకొచ్చే దారి ఖర్చులు కూడా రావు. వచ్చిన లోడ్ వెనక్కి వెళ్లలేదు అక్కడ ఉండలేదు.. అమ్ముడు పోదు.. పోనీ పారబోసి పోదామంటే డీజిల్ ఖర్చులు కూడా రావు.ఇదీ అక్కడి రైతుల పరిస్థితి. మరీ దారుణంగా.. పావలా అద్దురూపాయి కేజీ అంటూ.. రైతుని అవమానించడం కూడా కర్నూలు ఏరియాలో మామూలే. కానీ.. రైతుల్నుంచి పంట దళారీల చేతికి పోగానే మాత్రం రేటు పెరుగుతుంది. వినియోగ దారులు ఇంటికి తీసుకెళ్లే టైంకి పంట రేటు భారీగానే ఉంటుంది. ఇటు రైతు.. అటు కొనుక్కునే వారు నష్టపోతారు. మధ్యలో దళారీలు ఫుల్లుగా సంపాదించుకుంటారు.ఈ వ్యవస్థకి సొల్యూషన్ చూసుకోవడం రైతులతో అయ్యే పని కాదు. పట్టించుకుంటే ప్రభుత్వంతో అవుతుంది. కానీ.. ప్రభుత్వం పట్టించుకుంటుందా అన్నదే ప్రశ్న. కర్నూలు టమాట గురించి.. అక్కడ రైతులపై జరుగుతున్న దోపిడీల గురించి.. పార్టీలకీ ప్రభుత్వాలకి తెలీదంటే నమ్మడానికి ఎవరూ రెడీగా లేరు. ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోరు.అందుకే.. రోడ్డుమీదే పారబోసి వెళ్తున్నారు రైతులు. అయినా సరే.. ప్రజాప్రతినిధులు, అధికారులు గప్ చుప్ గా ఉంటారు. మరి ముందు నుంచీ ఇస్తున్న హామీల మాటేమిటి సీఎం సార్ అంటే మాత్రం.. జగన్ ఉలకరు పలకరు. రేట్లని బ్యాలెన్సింగ్ చేయడానికి 3 వేల కోట్లు కేటాయిస్తాం.. రైతులకి రేట్ల విషయంలో ప్రాబ్లమ్ రాకుండా చూస్తాం అని.. ఎన్నికలకి ముందైతే పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదో.. రెండేళ్లవుతున్నా.. తీరిక దొరకడం లేదో అఎవ్వరికీ అర్దం కావడం లేదు.