YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడప లో ఎటు చూసిన బీళ్లుగామారిన భూములు

కడప లో ఎటు చూసిన బీళ్లుగామారిన భూములు

కడప, జనవరి 16,
అసలే కరువు పీడిత ప్రాంతం.. పంటలు సాగుచేయాలంటే.... అవి చేతికి అందుతాయన్న నమ్మకం లేని పరిస్థితి.  ఎటు చూసిన బీళ్లుగా మారిన భూములు. తాగునీటికీ కటకట. అయినా సాహసం చేశారు రైతులు. ఆరుతడితో... నాబార్డు ఇచ్చిన భరోసాతో కర్భూజ సాగు చేశారు. కాసులు గలా గలా.. కరువు వెల వెల బోయేలా చేస్తున్నారు కడప జిల్లా రాయచోటి రైతులు. అసలే కరువు జిల్లా. అందునా రాయచోటి అంటే పూర్తిగా ఎడారిని తలపించే ప్రాంతం. పంట పొలాలలో సైతం రాళ్లు తప్ప భూసారం లేని నిర్జీవ పొలాలకు కేరాఫ్ అడ్రస్.  ఇలాంటి పరిస్థితులలో రైతులకు లాభాలు వచ్చేలా చేయాలని నాబార్డు నడుం కట్టింది. పంట మార్పిడి విధానంతో వాటర్ షెట్ పద్ధతి ద్వారా రైతులతో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. సాగుచేసిన 60 రోజులలోనే పంట ఫలం చేతికి అందేలా చేసిన ప్రయత్నం ఫలించింది. అధిక దిగుబడి చేతికి రావటంతో, సరుకు నాణ్యత చూసి వ్యాపారస్తులే తోటల వద్దకు వచ్చి సరుకు కొనుగోళ్లు చేస్తుకునే పరిస్థితికి వచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా రాయచోటి ప్రాంతంలో రైతులకు కొంత నీరు దొరుకుతుంది. మార్కెట్ లో డిమాండ్ ఉన్న వాటిని ఎంచుకొని పంటలను సాగుచేయడం కూడ ఆ కర్షకులకు కాసుల వర్షం కురిసేలా చేసింది. సాధారణంగా కర్భూజ రెండు నుంచి ఐడు కేజీలు ఉంటుంది. దీనికి భిన్నంగా ఈ ప్రాంతంలో సాగు చేసే కర్భూజ కాయలు 12కిలోల బరువు వరకు వస్తున్నాయి. విదేశాల్లో ఈ పంటకు డిమాండ్ ఉందని వ్యవసాయ శాఖ అధికారులే చెపుతున్నారు. అదే ఇప్పుడు రైతులకు వరంగా మారింది. కాయ కోతలను సాంకేతిక పద్దతుల ద్వారా కోసి లారీల్లో నింపుతున్నారు. తోటల నుంచి సేకరించిన కాయలు విదేశాలకు చేరాలంటే.. దాదాపుగా 10 నుంచి 20 రోజుల మధ్య సమయం పడుతుంది.కడప రైతు అంటే కరవు రైతన్న నానుడిని మార్చే విధంగా ఉంది కర్భూజ రైతుల విజయగాథ. ఈ దిగుబడులతో నష్టాలు...కష్టాలతో మందగిస్తున్న వ్యవసాయం మరింత అభివృద్ది ఫలాలను అందిస్తున్నాయి. పచ్చగడ్డి మొలకెత్తడమే కష్టమన్నఈ ప్రాంతంలో విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిన ఈ ప్రాంత రైతులు....కరవు ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలిచారు.

Related Posts