YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఇక ఎర్రగులాబీలేనా

ఇక ఎర్రగులాబీలేనా

హైదరాబాద్, జనవరి 19,
తెలంగాణలో రాజకీయం కాక మీద ఉంది. రెండు, మూడు నెలలుగా టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తలనొప్పే అని డిసైడ్‌ అయినట్టు ఉంది టీఆర్ఎస్‌. కొత్తగా మిత్రుల్ని వెతుక్కునే పనో ఏమో.. జాతీయ నాయకులను ఇంటికి పిలిచి విందు రాజకీయం చేస్తోంది గులాబీ పార్టీ.  సీపీఐ ప్రధాన కార్యదర్శి  రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు సీఎం కేసీఆర్‌. కలిసి పని చేసే విధంగా చర్చలు సాగినట్టు సమాచారం. జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తే.. కలిసి పనిచేస్తామనే సంకేతాలు ఇచ్చారట గులాబీ దళపతి. అయితే సీపీఐ, సీపీఎంల రాష్ట్ర నాయకులకు ఈ అంశంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయట.వాస్తవానికి కొన్నిరోజులుగా టీఆర్ఎస్ తో పరోక్షంగా లెఫ్ట్‌పార్టీలు కలిసే పని చేస్తున్నాయి. నాగార్జునసాగర్ నుంచి.. హుజురాబాద్ ఉపఎన్నిక వరకు.. లెఫ్ట్‌పార్టీలు మద్దతు పలికింది టీఆర్‌ఎస్‌కే. బీజేపీ గెలుస్తుంది అనుకున్నచోట గులాబీ పార్టీకి మద్దతు పలికాము అని చెబుతున్నా.. టీఆర్ ఎస్ తో చెట్టపట్టాల్ వేసుకునే ఉంది లెఫ్ట్. అయితే.. సీపీఎంకు టీఆర్ఎస్  మీద అనుమానాలు ఉన్నాయట. బీజేపీపై సీఎం కేసీఆర్‌ చేస్తున్న విమర్శలు అనుకున్నంత స్థాయిలో లేవనే ఫీలింగ్‌లో సీపీఎం ఉందట. పైగా బీజేపీని కేసీఆర్‌ దారిలోకి తెచ్చుకుంటున్నారేమో అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనుమానం వ్యక్తం చేశారు. అయితే టీఆర్‌ఎస్‌ను కాదంటే రాష్ట్రంలో మరొకరితో కలిసి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ మీద సానుకూల నిర్ణయం ఉంటే.. అప్పుడు కొంత వ్యూహం మారొచ్చు.నిజానికి లెఫ్ట్‌ పార్టీల మధ్య సఖ్యత లేదు. ఉద్యమాలలో కలిసి పనిచేస్తున్నా ఎన్నికలకు వచ్చే సరికి ఎవరి దారి వారిదే. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలే దానికి ఉదాహరణ. సీపీఐ, కాంగ్రెస్‌ కూటమితో జత కడితే.. సీపీఎం..బీఎల్ ఎఫ్ ను ఏర్పాటు చేసింది. చివరకు వామపక్షాలలకు అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో జట్టు కట్టినా.. రాష్ట్రంలో సీపీఐకి ఆ నిర్ణయం రుచించకపోవచ్చు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుసరించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేకపోతోంది చాడా అండ్‌ బ్యాచ్‌. ఇక గులాబీ దళపతి వైఖరిని చివరి వరకు నమ్మలేమనే అభిప్రాయం ఉభయ కమ్యూనిస్ట్‌లలో ఉన్నప్పటికీ.. టీఆర్ఎస్ తో కలిసి పనిచేసే విషయంలో కలిసి సాగుతారా లేదా అనేది క్లారిటీ లేదు.కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తెలంగాణలో లెఫ్ట్‌ పార్టీలు తమతో కలిసి వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే కానీ.. ఆపార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పరిస్థితి లేదు. అందుకే గులాబీతో సోపతి చేయడానికి తహతహలాడుతున్నాయనే చర్చ మొదలైంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts