న్యూఢిల్లీ, జనవరి 19,
దేశరాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుతాయి. సాధారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సైనిక విన్యాసాలు ఒక ఎత్తు అయితే, దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించి ప్రదర్శించే శకటాలు మరోక ఎత్తు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అయా రాష్ట్రాలు తమ ప్రత్యేకతను చాటుతూ రాజ్‌పథ్‌లో శకటాలు ప్రదర్శిస్తుంటాయి. ముఖ్యంగా తమ తమ రాష్ట్రాల చరిత్ర, సంస్కృతులు ప్రతిభించేలా ఈ శకటాలను రూపొందిస్తుంటారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో దేశంలోని 29 రాష్ట్రాలకు గాను కేవలం 21 రాష్ట్రాలకు మాత్రమే తమ శకటాలను ప్రదర్శించే అవకాశం దక్కింది.ఇక, తెలంగాణ శకటాలకు అనుమతి లభించకపోవడం ఇది కొత్తేం కాదు! 2015లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో కొత్త రాష్ట్రం తెలంగాణకు తొలిసారి అవకాశం వచ్చింది. అయితే, అప్పుడు కూడా రక్షణ అధికారుల కమిటీ తెలంగాణ శకటాన్ని అనుమతించలేదు. దీంతో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి నేతృత్వంలోని ఓ బృందం అప్పటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ను కలిసి విజ్ఞప్తి చేసి ఒప్పించారు. పైగా ఆ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా పొల్గొన్నారు. దీంతో కొత్త రాష్ట్రం గురించి ప్రపంచానికి తెలిసే అవకాశం దక్కుతుందని జితేందర్ రెడ్డి చేసిన వినతితో ఏకీభవించి ఎట్టకేలకు అనుమతించారు. కానీ, రెండోసారి 2016లోనూ తెలంగాణ శకటాన్ని తిరస్కరించింది కేంద్ర రక్షణ శాఖ.ఇదిలావుంటే, ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి మొత్తం 56 ప్రతిపాదనలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరిలో 21 మందిని షార్ట్‌లిస్ట్ చేశామని, ప్రతి సంవత్సరం ఇదే విధమైన ఎంపిక ప్రక్రియను అవలంబిస్తున్నామని వారు తెలిపారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి అందిన పట్టిక ప్రతిపాదనలు కళ, సంస్కృతి, శిల్పం, సంగీతం, ఆర్కిటెక్చర్, కొరియోగ్రఫీ రంగాలలో ప్రముఖులతో కూడిన నిపుణుల కమిటీ వరుస సమావేశాలలో చర్చిం,చి ఎంపికల చేయడం జరుగుతుందని కేంద్ర వర్గాలు తెలిపాయి.కాగా, 12 రాష్ట్రాలు, 9శాఖల శకటాలను ప్రదర్శించేందుకు కేంద్రం అనుమతించగా.. అరుణాచల్‌ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్ శకటాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.