YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

క్రాస్ రోడ్స్ లో మెగా ఫ్యాన్స్

క్రాస్ రోడ్స్ లో మెగా ఫ్యాన్స్

ఏలూరు, జనవరి 19,
మెగాబ్రదర్స్ డిఫరెంట్ వర్షన్స్‌తో మెగా అభిమానులు టోటల్‌గా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే సొంత సామాజికవర్గమైన కాపుల్లో కూడా కన్ఫ్యూజన్ వస్తుంది..అసలు వారు జనసేనకు సపోర్ట్ ఇవ్వాలా లేక జగన్‌కు సపోర్ట్ ఇవ్వాలా అనే విషయంపై కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. దానికి కారణం చిరంజీవి అనే చెప్పొచ్చు. ఎందుకో చెప్పాల్సిన పని కూడా లేదని చెప్పొచ్చు. చిరంజీవి సినిమా పెద్దగా ఉండనని చెప్పి…సినిమా పెద్దగానే ముందుకెళుతూ జగన్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు.అసలు పవన్ కల్యాణ్…జగన్ ప్రభుత్వంపై ఏ విధంగా ఫైట్ చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. గత రెండున్నర ఏళ్లుగా జగన్ ప్రభుత్వంపై పవన్ యుద్ధం చేస్తున్నారు. వైసీపీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో కాపుల్లో కూడా జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి మొదలైంది. అయితే ఇలా ఇలాంటి తరుణంలో వారిని చిరంజీవి కన్ఫ్యూజన్‌లో పడేశారని చెప్పొచ్చు. వాస్తవానికి చిరంజీవి రాజకీయాల్లో లేరు..కానీ ఆయన రాజకీయాలని ప్రభావితం చేయగలరు. ఆ శక్తి చిరుకు ఉంది…తన అభిమానులని, కాపు వర్గాన్ని ప్రభావితం చేయగలరు.అంత శక్తి ఉన్న చిరంజీవి… జగన్‌కు అనుకూలంగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. పైగా జగన్ కూడా తెలివిగా చిరంజీవినే ముందుపెడుతున్నట్లు కనిపిస్తోంది. సినీ ఇండస్ట్రీలో అనేకమంది పెద్ద నటులు ఉన్నారు….వారిని కూడా పిలిస్తే బాగుండేది..కానీ జగన్, చిరుని మాత్రమే పిలవడం వెనుక రాజకీయం కోణం ఉందని అంతా అనుమానిస్తున్నారు.అదే సమయంలో చిరంజీవి సినిమా టిక్కెట్ల అంశంపై పరిష్కారం దొరికిందో లేదో క్లారిటీ ఇవ్వకుండా, జగన్ మంచిగా భోజనం పెట్టారు… తన సూచనలని విన్నారు.. జగన్ అందరి మనిషి అన్నట్లు పరోక్షంగా పొగడ్తల వర్షం కురిపించారు. దీని వల్ల కాస్త సీన్ మారింది.. .మెగా అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్తితి వచ్చింది. చిరంజీవి మాటలని బట్టి చూస్తే కొంత జగన్ పట్ల పాజిటివ్‌గా మారవచ్చు. ఇక పవన్ ఎంట్రీ ఇచ్చి ఆ పరిస్తితి మార్చల్సిన అవసరం ఉందని, జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. లేదంటే జనసేనకు డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు.
మెగా స్టార్ ఫైర్
మెగాస్టార్ చిరంజీవి కొత్త వివాదంలో ఇరుక్కున్నారు.గ‌తంలో క‌న్నా ఇప్పుడాయ‌న మీడియాపై కాస్త ఎక్కువ‌గానే కోపంగా ఉన్నారు. గ‌తంలో కూడా మీడియాతో మెగా కుటుంబానికి కొన్ని వివాదాలున్నాయి.అస‌త్య వార్తా క‌థ‌నాల‌పై గ‌తంలో ప‌వ‌న్ కూడా ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే! ఇప్పుడు త‌మ్ముడి బాట‌లో అన్న‌య్య న‌డిచి పెద్ద చ‌ర్చ‌కే తెర‌లేపారు. గివ్ న్యూస్ నాట్ వ్యూస్ పేరిట ఓ ట్రెండ్ టాపిక్ ట్విట‌ర్ లోకి తీసుకువ‌చ్చి, ఆ మాట‌కు ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి డిజిట‌ల్ మాధ్య‌మాల్లో ట్రోల్ చేయిస్తున్నారు.ముఖ్యంగా ఎప్ప‌టి నుంచో ఉన్న వివాదం కావ‌డంతో చాలా మంది సెల‌బ్ లు పైకి ఎలా ఉన్నా లోప‌ల మాత్రం అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. ఏం చెప్పినా ఏం చేసినా మీడియాతో తంటే అన్న విధంగా ఇప్పుడున్న కాలంలో చాలా మార్పులు జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ప్ర‌భావం చూపిస్తున్నాయి. అందుకే చాలా మంది మాట్లాడేందుకు క‌నీసం స్టూడియోల్లోకి వ‌చ్చి త‌మ వాద‌న చెప్పుకునేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఒక‌వేళ లైవ్ లోకి వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చినా కూడా త‌రువాత చేసే స్టోరీల‌లో సొంత భావ‌జాలం ఒక్క‌టి తెర‌పైకి తెస్తున్నారు. దాంతో వివాదాలు పెరిగి పెద్ద‌వి అయిపోతున్నాయి.ఒక‌రు కాకున్నా ఇంకొక‌రు అయినా ఇవాళ రాయ‌క త‌ప్ప‌డం లేదు. డిజిట‌ల్ మాధ్య‌మాల నుంచి ఓ అస‌హ‌జ పోటీ నెల‌కొని ఉంది. దీంతో ప్రింట్ మ‌రియు ఎల‌క్ట్రానిక్ మీడియాలు కూడా వాటినే ఆధారంగా చేసుకుని నాలుగు వార్త‌లు అందించాల్సి వ‌స్తోంది. ఇది నిజంగా ఓ దౌర్భాగ్యం. కొన్ని విష‌యాల్లో సోష‌ల్ మీడియా అప్ డేట్స్ ను వార్త‌లుగా మార్చ‌డం మంచిదే కానీ ఓ చిన్న లీక్ ను ప‌ట్టుకుని వార్త‌లు రాసి, తెగ హ‌ల్ చ‌ల్ చేయ‌డంలో భావ్యం లేదు.ఇదే చిరు మ‌న‌సును క‌ల‌వ‌ర‌పెడుతోంది. అలా అని పూర్తిగా మీడియాను ఆయ‌న దూరం పెట్ట‌లేరు. ఒక‌వేళ ఎవ‌రినైనా పిలిపించి మాట్లాడితే ఆ ఒక్క సంద‌ర్భంలో చెప్పిన నాలుగు మంచి మాట‌లు వ‌దిలి, అందులో కూడా  కాంట్రవ‌ర్శీలు వెతుకుతున్నారు.దీంతో వివాదాలు చిలువ‌లు ప‌లువులుగా మారి త‌లనొప్పిగా పరిణ‌మిస్తున్నాయి.

Related Posts