కుప్పం
చిత్తూరు జిల్లా కుప్పం పిఈఎస్ మెడికల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా తో బాధపడుతున్న విజయ్ ఆసుపత్రి లోని నాల్గవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతున్న విజయ్ కు కోవిడ్ పాజిటివ్ రావడంతో కోవిడ్ వార్డుకు మార్చేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఒక్కసారిగా పై నుండి దూకేసాడు. కిందపడిన విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో విజయ్ బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు..