YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నాలుగు రోజుల్లో…ఒంటరిగా… ఎవరెస్టును అధిరోహించిన విశాఖవాసి

నాలుగు రోజుల్లో…ఒంటరిగా… ఎవరెస్టును అధిరోహించిన విశాఖవాసి

విశాఖపట్నం
నాలుగు రోజుల్లో ఎవరెస్ట్ శిఖరా న్ని అధిరోహించి ఓ యువకుడు రికార్డు సృష్టించాడు. గంటల వ్యవది లోనే ఎవరెస్ట్ బేస్ క్యాంపును పూర్తి చేరిన మొట్టమొదటి ఇండియన్ గా సురేష్ బాబు అనే యువకుడు  కీర్తి నార్జించారు. పర్వతారోహణలో అరు దైన రికార్డును అధిగమించి తనకంటు అంతర్జాతీయ స్ధాయిలో ప్రత్యేకత సంతరించుకునేలా ఎవరెస్ట్ బేస్ క్వాం ప్ కు కేవలం నాలుగు రోజుల్లో చేరు కుని రికార్డును బ్రెక్  చేశారు.అతి తక్కువ సమయంలో సముద్ర మట్టా నికి 5364 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నకు చేరుకున్నా రు. డిసెంబరు 20న నేపాల్ లోని లూళ్ల నుండి ఒంటరిగా తన సాహస  యాత్ర ను ప్రారంభించారు. పది రోజులపాటు సాగే సాహస యాత్రను సురేష్ బాబు కేవలం నాలుగు రోజుల్లో ముగించి సెంబరు 24వ తేదీ నాటికి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నకు చేరుకున్నా రు. మైనస్ 20  డిగ్రీల సెల్సియస్ అతి శీతల ఉష్ణోగ్రతలో, 40 శాతం ఆక్సిజన్ వాయువు మాత్రమే దొరికే హిమాలయ పర్వత శ్రేణలో ఈ సాహస యాత్ర ముగిసింది. రాళ్ళు, మంచుతో నిండిన అతి కఠినమైన పర్వత  మార్గాలలో రోజుకి పది గంటలు నడుస్తూ కేవలం నాలుగు రోజుల్లోనే చేరుకుని,ఈ ఘన త సాధించిన తొలి భారతీయునిగా సురేష్ బాబు నిలిచారు.విశాఖ నుండి బయలుదేరి ఢిల్లీ మీదుగా నేపాల్ రాజధాని  కాట్మండు చేరుకున్నారు. నేపాల్ ప్రభుత్వంచే గుర్తింపబడిన ' అక్యూట్ అడ్వెంచర్ సంస్థ ఆధ్వర్యం లో ఈ సాహస యాత్రను ప్రారంభిం చారు.మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించిన సురేష్ బాబు సముద్ర  మట్టానికి 5550 మీటర్ల ఎత్తులో ఉన్న కాలా పత్తర్ పర్వతాన్ని, 6160 మీటర్ల ఎత్తులో ఉన్న ఐస్లాండ్ పీక్ కూడా అధిరోహించారు.ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నకు సురేష్ బాబు ఒంటరిగా అతి తక్కువ సమయంలో
చేసిన సాహస యాత్రను నేపాల్ ప్రభుత్వం గుర్తించిం ది.అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడి గా నేపాల్ ప్రభుత్వం,అక్యూట్ అడ్వెం చర్ సంస్ధ ధృవీ కరణ పత్రాలు అందజేశాయి. చిన్న తనం నుంచి క్రీడలపై ఆశక్తితో ఉన్న సురేష్ బాబు పలు పతకాలు సాధించారు.

Related Posts