YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మునిసిపల్ కార్మికుల సమ్మె

మునిసిపల్ కార్మికుల సమ్మె

విశాఖపట్నం
మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, పిఆర్సి ప్రతిపాదనలను సవరించాలని కోరుతూ విశాఖలో జీవిఎంసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ధర్నాకు దిగింది.కలెక్టర్ కార్యాలయం వద్ద  నిరసనకు దిగిన యూనియన్ నాయకులు పిఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.ఉద్యోగులు కార్మికులు తీవ్రంగా నష్టం  కలిగేలా ఉన్న పిఆర్సీని రద్దు చేసి అందరికీ ప్రయోజనకరంగా ఉండేలా కొత్త జీవోను తీసుకురావాలని డిమాండ్ చేశారు.గతంలో మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అందుకు  అనుగుణంగా నిర్ణయాన్ని తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎంతమంది పాలకులు మారినా తమను మాత్రం పర్మినెంట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Related Posts