ముంబయ్ :ఆంధ్ర బ్యాంకు అహ్మదాబాద్ కి చెందిన స్టెర్లింగ్ బయోటెక్ ఫై నేషనల్ కంపెనీ లా ట్రీబ్యూనల్ (ఎన్ సి ఎల్ టి) ముంబై బెంచ్ లో దివాళా పిటేషన్ దాఖలు చేసింది. బ్యాంకు నుంచి తీసుకున్న రూ.4 ,000 కోట్లు తిరిగి చెలించకపోవడం తో ఎన్ సి ఎల్ టి ని ఆశ్రయించింది. కేసు విచారణకి ముందు స్టెర్లింగ్ గ్రూప్ అఫ్ కంపెనీస్ ఫై వచ్చిన ఆరోపణల వివరాలు తెలియచేయవలసిందిగా ముంబై రిజిస్టర్ అఫ్ కంపెనీస్ ని ట్రిబ్యునల్ కోరింది. కేసు తదుపరి విచారణను సోమవారం చేపడుతుంది. ఆంధ్రాబ్యాంక్ ఆద్వర్యంలోని కన్సార్షియం స్టెర్లింగ్ బయోటెక్ గ్రూపునకు 5 ,000 కోట్లకు పైగా రుణాలు ఇచ్చింది. బెంచ్ ముందు హాజరైన న్యాయవాది మాట్లాడుతూ సెంట్రల్ బ్యురో అఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్టెర్లింగ్ బయోటెక్ కేసు ని విచారిస్తున్నాయని వివరించారు.