YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఫన్, సస్పెన్స్ డ్రామాతో ఆకట్టుకుంటున్న "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" సినిమా ట్రైలర్

ఫన్, సస్పెన్స్ డ్రామాతో ఆకట్టుకుంటున్న "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" సినిమా ట్రైలర్

ఇంద్రసేన, సంతోష్ రాజ్, నవీనా రెడ్డి, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్". సస్పెన్స్ కామెడీ డ్రామా కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రవి చావలి  తెరకెక్కిస్తున్నారు. ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడెమీ, ప్లాట్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్, తిరుమల మీడియా బ్యానర్స్ పై నిర్మాతలు అతీంద్ర అవినాష్ మరియు అలవలపాటి శేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" చిత్రానికి రాఘవేంద్ర రెడ్డి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" సినిమా ట్రైలర్ విడుదలైంది. ఫన్ సస్పెన్స్ డ్రామాతో ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటూ ఆకట్టుకుంటోంది.
"బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే.. ఇవాళ, రేపు తప్పు చేయకుండా బతకడం కష్టంరా.. కానీ పక్కోడు చేసిన తప్పును వాడుకుని బతకడం ఈజీ అనుకుంటారు రాజు, రమేష్ అనే ఇద్దరు యువకులు. ఇదే ఆలోచనతో సులువుగా డబ్బు సంపాదిస్తూ జల్సా చేస్తుంటారు. ఈ క్రమంలో వాళ్లు కామెడీ, యాక్షన్ చేయాల్సివస్తుంది. ఇద్దరు హీరోయిన్ల క్యారెక్టర్స్ ను కూడా పరిచయం చేశారు. నేను చాలా అదృష్టవంతుడిని అని చెప్పుకున్న విలన్ సత్యప్రకాష్ తో ఇప్పటి నుంచి నీకు శని దశ మొదలైందిరా అంటారు హీరోలు. బంగారు గుడ్లు పెట్టే బాతును చంపకూడదురా అది పెడతనే ఉండాలే మనం బాగుపడతనే ఉండాలే. అంటూ హీరో చెప్పే డైలాగ్ తో ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ కంప్లీట్ అవుతుంది.
సస్పెన్స్ కామెడీ డ్రామా మూవీగా తెరకెక్కిన "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ వస్తుందని చెబుతున్నారు దర్శకుడు రవి చావలి. మరి ఆ ట్విస్టులు ఎలా ఉంటాయో త్వరలోనే థియేటర్ లలో సినిమా రిలీజ్ అవగానే చూసేయొచ్చు.
సత్య ప్రకాష్,‌ శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్ - మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ - విజయ్ సి కుమార్, సంగీతం - బాంబే భోలే, పీఆర్వో - జీఎస్కే మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - దుర్గాప్రసాద్ శెట్టి , నిర్మాతలు - అతీంద్ర అవినాష్, శేఖర్ అలవలపాటి సమర్పణ - రాఘవేంద్ర రెడ్డి, దర్శకత్వం - రవి చావలి

Related Posts